hyderabadupdates.com Gallery న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది

న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది

న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది post thumbnail image

హైద‌రాబాద్ : 24 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి ప్ర‌త్యూష కేసుపై. మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌త్యూష కేసులో కీల‌క నిందితుడిగా ఉంటూ బెయిల్ పై బ‌య‌ట ఉన్న సిద్దార్థ్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. నాలుగు వారాల లోపు లొంగి పోవాల‌ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆల‌స్యం ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై తీవ్రంగా స్పందించారు న‌టి ప్ర‌త్యూష త‌ల్లి స‌రోజ‌నీదేవి.
ఇదిలా ఉండ‌గా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష తల్లి సరోజిని గత కొన్నేళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, సరోజిని స్పందిస్తూ, తన కుమార్తెకు న్యాయం జరగలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మునుస్వామి కమిషన్ ప్రత్యూషను అత్యాచారం చేసి హత్య చేశారంటూ పేర్కొన్న‌ద‌ని అన్నారు. జీవిత ఖైదుకు బదులుగా సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష ప్రకటించింద‌ని, ఈ శిక్ష ఏ మాత్రం స‌రిపోద‌ని అన్నారు. గత 23 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నాను కానీ నా కుమార్తెకు న్యాయం జరగలేదంటూ వాపోయింది. న‌టి ప్ర‌త్యూష ఫిబ్ర‌వ‌రి 23, 2002లో మ‌ర‌ణించింది.
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా.. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని తాను అనుకోవ‌డం లేద‌న్నారు స‌రోజ‌నీదేవి. నా కూతురును చంపేశారు, సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేద‌న్నారు.
The post న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేంతెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం

న్యూఢిల్లీ : వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై స‌వాల్ చేస్తూ తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. శుక్ర‌వారం

Manchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణుManchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు

    విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ రూ.15 లక్షల జరిమానా విధించిన సంగతి

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ