hyderabadupdates.com movies నిధి పాప నోట.. ‘బాబులకే బాబు’ మాట

నిధి పాప నోట.. ‘బాబులకే బాబు’ మాట

కొందరు పరభాషా కథానాయికలను చూస్తే.. వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు అనే ఫీలింగే రాదు. చక్కగా తెలుగు నేర్చుకుని, తెలుగులో మాట్లాడ్డమే కాదు.. ఇక్కడి కల్చర్‌కు తగ్గట్లుగా వ్యవహరిస్తుంటారు. అభిమానులు హీరోలు, హీరోయిన్ల విషయంలో చేసే కామెంట్లు, నినాదాల గురించి కూడా తెలుసుకుని.. వాటిని స్టేజ్‌ల మీద, ఇంటర్వ్యూలో ప్రస్తావించి ఆశ్చర్యపరుస్తుంటారు. నిధి అగర్వాల్ ఈ కోవకే చెందుతుంది. 

తన మాటతీరు, నడవడిక, కమిట్మెంట్‌తో తాను పని చేస్తున్న స్టార్ హీరోల అభిమానులను ఆమె అమితంగా ఆకట్టుకుంటోంది. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆలస్యమైనప్పటికీ కొన్నేళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తూ ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ నిధి.. రిలీజ్ టైంలో ప్రమోషన్ల కోసం ఎలా కాళ్లరిగేలా తిరిగిందో తెలిసిందే. స్వయంగా పవన్ ఆమెను చూస్తే తనకు సిగ్గుగా ఉందన్నాడు.

ఇక తన కొత్త చిత్రం ‘రాజాసాబ్’ కోసం కూడా అలాగే శ్రమిస్తోంది నిధి. ఒక ఈవెంట్ సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డా కూడా ఫ్యాన్స్‌ను పల్లెత్తు మాట అనలేదు. వారి మీద కేసులు పెట్టమంటే వద్దంది. కట్ చేస్తే ఒక ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు ఏమంటారు అని అడిగితే.. ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ ఫ్యాన్స్ ఈవెంట్లలో వల్లెవేసే మాటను చెప్పింది నిధి. 

మరి ప్రభాస్ గురించి ఏమంటారు అంటే.. ‘‘రాజులకే రాజు ప్రభాస్ రాజు’’ అనే నినాదం గురించి చెప్పింది. మరి మీ గురించి ఫ్యాన్స్ అభిప్రాయం ఏంటి అంటే.. ‘‘పాపలకే పాప నిధి పాప’’ అంటూ నవ్వేసింది నిధి. ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగితే.. సినిమా ఈవెంట్లకు వెళ్తే ఇలాంటి నినాదాలతోనే అభిమానులు హోరెత్తిస్తుంటారని.. అందుకే తనకు అవి కంఠతా వచ్చేశాయని నిధి చెప్పింది. డిజాస్టర్ అయిన ‘హరిహర వీరమల్లు’ సినిమా వల్ల కూడా తనకు మేలే జరిగిందని.. తనకు పెర్ఫామర్‌గా పేరు రావడం సంతోషం కలిగించిందని ఆమె చెప్పడం విశేషం.

Related Post

Jolly LLB 3 VPF Controversy Fallout: PVR Inox To Be Investigated By CCI For Abusing Dominant PositionJolly LLB 3 VPF Controversy Fallout: PVR Inox To Be Investigated By CCI For Abusing Dominant Position

Following the recent VPF controversy surrounding Jolly LLB 3, the Competition Commission of India (CCI) has ordered an investigation into PVR Inox, the country’s largest multiplex chain, for allegedly abusing

షోలే హీరోకు ‘ఇక్కీస్’ చివరి సెలవుషోలే హీరోకు ‘ఇక్కీస్’ చివరి సెలవు

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర చివరి సినిమా ఇక్కీస్ నిన్న విడుదలయ్యింది. గత నెలరోజులుగా దురంధర్ ఫీవర్ లో మునిగి తేలుతున్న హిందీ ప్రేక్షకులకు కాస్త తెరిపినిచ్చేలా