hyderabadupdates.com movies ‘నెలసరి’ సెలవులపై సుప్రీం చెప్పింది కరెక్టేనా?

‘నెలసరి’ సెలవులపై సుప్రీం చెప్పింది కరెక్టేనా?

కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో కోణంలో కాస్త ఆలోచించి చూసినప్పుడు.. ముందు అనుకున్నదానిలో దొర్లిన లోపాలు ఇ్టే అర్థమవుతాయి. ఇప్పుడు అలాంటి పనే చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.

ఒక విషయానికి సంబంధించి  సానుకూల అంశాలతోపటు ప్రతికూల అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ప్రస్తావించి.. హెచ్చరించిన వైనం చూసిప్పుడు సుప్రీం కోర్టు చెప్పిన మాట అక్షర సత్యం కదా అని అనుకోకుండా ఉండలేం. మహిళా ఉద్యోగులకు నెలసరి వేళ.. వారికి సెలవులు ఇచ్చే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

దీనికి సంబంధించిన చట్టాన్ని చేపట్టి.. అందుకు తగ్గ నియమాలను రాష్ట్రాలకు ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలకు ఉపాధి అవకాశాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న సుప్రీం.. ‘మనం అలాంటి నిబంధనల్ని తీసుకొస్తే.. కంపెనీలు మహిళలను తీసుకోవు. అలా చేస్తే.. మహిళలు నష్టపోతారు’ అని పేర్కొన్నారు.

ఇలాంటి చట్టాలతో తాము పురుషుల కంటే తక్కువనే భయం ఉద్యోగాలు చేసే మహిళల్లో క్రియేట్ చేసే అవకాశం ఉందన్న సుప్రీంకోర్టు.. రుతుక్రమం మీద అవగాహన కల్పించటం వేరని.. దానిని సన్సేషన్ చేయటం వేరుగా పేర్కొంది. ఆ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత నుంచి మహిళల్ని ఎవరూ నియమించుకోరని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది షంషద్ తన వాదనలు వినిపిస్తూ 2013లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే విధంగా ప్రైవేటు కంపెనీలు అలాంటి వెసులుబాటును కల్పిచాలని కోరారు.

అలా చేయటం ద్వారా.. కంపెనీలు మహిళల్ని ఎవరూ నియమించుకోరన్న సుప్రీంకోర్టు.. ‘‘మీకు సంస్థల యజామాన్యాల మనస్తత్వం గురించి తెలియదు. ఈ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన మరుక్షణం వారిని ఎవరూ నియమించుకోరు’ అని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. వారి కెరీర్ ఇట్టే ముగిసిపోతుంది’ అని స్పష్టం చేశారు.

ఇలాంటివాటిని తప్పనిసరి చేస్తే.. వారికి ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారిభవిష్యత్తుకు అడ్డంకిగా మారతాయన్నది మర్చిపోకూడదని పేర్కొనటం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే.. నిజమే కదా? అనుకోకుండా ఉండలేం.

Related Post

అమ‌రావ‌తికి కీల‌క సంస్థ‌… జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గాల్సిందే!అమ‌రావ‌తికి కీల‌క సంస్థ‌… జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గాల్సిందే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌య‌మే క‌రెక్ట్ అన్న ధోర‌ణితో ఉన్నారు. ఈ విష‌యం ఇటీవల ఆయ‌న మీడియాతో మాట్లాడిన‌ప్పుడు కూడా స్ప‌ష్ట‌మైంది. నిజానికి కాలం మారుతోంది. ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణులు కూడా మారుతున్నాయి.

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే పాటకు నెగటివిటీ వచ్చింది. హరీష్ శంకర్ గత సినిమా మిస్టర్ బచ్చన్ పెద్ద

మాస్ బలం తెలుసుకోండి రాజామాస్ బలం తెలుసుకోండి రాజా

గత నెలాఖరున విడుదలైన మాస్ జాతర యూనానిమస్ ఫెయిల్యూర్ అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరీ రొటీన్ కంటెంట్ తో దర్శకుడు భాను భోగవరపు తనకు దక్కిన తొలి అవకాశాన్ని వృథా చేసుకున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ధమాకా స్థాయిలో రవితేజ,