hyderabadupdates.com Gallery పోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వు

పోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వు

పోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వు post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజకీయాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీ ఒంట‌రిగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. త‌న‌పై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా త‌ల వంచన‌ని ప్ర‌క‌టించారు. నేను బానిసగా ఉండటానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తాను ముందు నుంచి పోరాట‌మే ప‌నిగా ముందుకు సాగుతున్నాన‌ని పేర్కొన్నారు. ఎవ‌రినీ దేబ‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు విజ‌య్. ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సిస్తే స‌రిపోద‌ని అన్నారు. ఆనీ మిమ్మ‌ల్ని మీరు కూడా విశ్వ‌సించాలని హిత‌వు ప‌లికారు టీవీకే చీఫ్‌. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ తో క‌లిసి పోటీ చేయ‌నున్నార‌ని, ఈ మేర‌కు త‌నపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్టాడు.
ఈ మేర‌కు టీవీకే విజ‌య్ మీడియాతో మాట్లాడారు. ఎన్ని కుట్ర‌ల‌కు తెర లేపినా, భ‌యాందోళ‌న‌కు గురి చేసినా , ఇక్క‌ట్లకు గురి చేస్తున్నా స‌రే తాను ఒత్తిళ్ల‌కు లొంగే ర‌కం కాద‌న్నారు . ఎవ‌రి నీడ‌లోనో తాను బ‌త‌క‌డానికి లేదా బానిస‌గా ఉండేందుకు పాలిటిక్స్ లోకి రాలేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా బీజేపీ జ‌న నాయ‌గ‌న్ చిత్రాన్ని అడ్డుకుంటోంద‌ని, ఎన్డీయే కూట‌మిలో చేర‌మ‌ని విజ‌య్ పై ఒత్తిడి తెచ్చేందుకు క‌రూర్ తొక్కిస‌లాట‌ను సాకుగా తీసుకుని సీబీఐ విచార‌ణ‌ను వాడుకుంటోందంటూ విదుతలై చిరుతైగల్ కట్చి నాయకుడు తోల్. తిరుమావళవన్‌తో సహా డీఎంకే మిత్రపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో విజ‌య్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.
The post పోరాడ‌ట‌మే త‌ప్పా పొత్తులంటూ ఉండ‌వు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపుఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఈ మేర‌కు సానుకూలమైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డంతో విస్తృతంగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా దావోస్ లో

ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లుఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో వ్య‌వసాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ‌, అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం

ప్ర‌జా ప్ర‌తినిధులు క్రీడ‌ల‌పై ఫోక‌స్ పెట్టాలిప్ర‌జా ప్ర‌తినిధులు క్రీడ‌ల‌పై ఫోక‌స్ పెట్టాలి

హైద‌రాబాద్ : ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జా సేవ‌తో పాటు క్రీడ‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టాల‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్‌బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా ప్రజాప్రతినిధుల సందడితో కోలాహళంగా మారడం