hyderabadupdates.com Gallery పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన post thumbnail image

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ ఏ చీఫ్ ఇంజనీర్ ఎం . రమేష్ కుమార్ తో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పీ పీ ఏ ఉప సంచాలకులు ప్రవీణ్ వర్మ, రాష్ట్ర జల వనరుల శాఖ ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, ఎస్ ఈ ఆర్. రామచంద్ర రావు, నాణ్యతా విభాగం చీఫ్ ఇంజనీర్ శేషు బాబు, ఎస్ ఈ తిరుమల రావు, ఈ ఈ లు బాల కృష్ణ, శ్రీనివాస్, నరసింహారావు, ప్రేమ్ చంద్ , నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి , తదితరులు పాల్గొన్నారు.
గత నెల చివరి వారంలో నాలుగు రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం పోలవరంలో పర్యటించింది. ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించింది. పలు సూచనలు, సలహాలు చేసింది. ఆ తరువాత ఢిల్లీలో పీ పీ ఏ సి ఈ ఓ పైతాన్కర్ తో సమావేశమైంది. ఆ సమావేశం తరువాత పోలవరం పర్యటనకు వచ్చిన పైతాన్కర్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై తొలుత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం ఆయన క్షేత్ర స్థాయిలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది 2027 సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నాటికి పోల‌వ‌రం ను పూర్తి చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.
The post పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి : తిరుప‌తి న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం స‌మీక్ష చేప‌ట్టారు. నగర కమిషనర్ మౌర్య‌ ,

కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయంకలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం

హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌతిండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా

మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలిమత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి

అమ‌రావ‌తి : మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ , కమిటీ సభ్యులు