hyderabadupdates.com Gallery ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్

ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్

ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్ post thumbnail image

హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ భారీ బ‌డ్జెట్ తో ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ది కుమారి కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైంది. ఆశించిన మేర వ‌ర్క‌వుట్ కాలేదు. అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఆపై ద‌ర్శ‌కుడు మారుతిపై తీవ్ర విమ‌ర్శ‌లు నెల‌కొన్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ కొన‌సాగుతూనే ఉంది. ఇదిలా ఉండ‌గా ఇదే ఫెస్టివ‌ల్ సంద‌ర్బంగా ప‌లు సినిమాలు ముందుకు వ‌చ్చాయి. న‌వీన్ పోలిశెట్టి, చాందిని చౌద‌రి ముఖ్య పాత్ర‌లు పోషించిన అన‌గ‌న‌గా ఒక రోజు, ప్ర‌భాస్ న‌టించిన రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి, వెంక‌టేష్‌, న‌య‌నతార , టీటీకే గ‌ణేష్ కీ రోల్స్ పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి, ఆషికా రంగ‌నాథ్ న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఙ‌ప్తి రిలీజ్ అయ్యాయి.
ప‌లు సినిమాలు విడుద‌లైనా చివ‌ర‌కు టాప్ లో కొన‌సాగుతోంది మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు, అన‌గ‌న‌గా ఒక రోజు మాత్ర‌మే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ, వినోదం ప్ర‌ధానంగా సాగిన సినిమాల‌కే జ‌నం జై కొట్టారు. ఈ త‌రుణంలో ప్ర‌భాస్ రాజ్ న‌టించిన మూవీ ఆశించిన మేర ఆడ‌క పోవ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు తీవ్రంగా న‌ష్ట పోయారు. పెట్టిన డ‌బ్బులు రాక పోవ‌డంతో వారంతా తీవ్ర నిరాశ‌కు లోనయ్యారు. ఈ మేర‌కు దాదాపు 50 శాతానికి పైగా తాము న‌ష్ట పోయామ‌ని, వెంట‌నే త‌మ డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని కోరుతున్నారు.
The post ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

NDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంNDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం

    ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో పోటీ చేసిన ఎన్డీఏ కూటమి దాదాపు 203 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

అట్లీ స్పెషల్‌ సాంగ్‌!అట్లీ స్పెషల్‌ సాంగ్‌!

అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా కోసం బన్నీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌కు ప్రత్యేకంగా ప్లాన్ జరుగుతోంది. ఆ పాట కోసం

‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

బెంగ‌ళూరు : పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ కీ రోల్ పోషిస్తున్న చిత్రం టాక్సిక్. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో త‌న ఫ్యాన్స్ తో పాటు