hyderabadupdates.com Gallery ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ post thumbnail image

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్ద‌రామ‌య్య మ‌రో వైపు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ మ‌ధ్య ఆధిపత్య పోరు కొన‌సాగుతోంది. ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ఎవ‌రు ఉండాల‌నేది పార్టీ హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని ఇప్ప‌టికే ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. సోనియా , రాహుల్ గాంధీ, తాను క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు సీఎం, డిప్యూటీ సీఎం. ఈ త‌రుణంలో ప్ర‌తిప‌క్ష నేత ఆర్. అశోక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
ఆయ‌న బాంబు పేల్చారు అధికారంలో చోటు చేసుకున్న ఆధిపత్య పోరు గురించి. ఏకంగా ఆర్. అశోక సీఎం సిద్ద‌రామ‌య్య ఫోన్ ట్యాపింగ్ కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు మండిప‌డ్డారు. ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరిస్తుందని, ఇందులో కొత్తేముందంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి పరమేశ్వరన్.
సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారినే నియమించాడ‌ని, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత ఆర్.అశోక్. సీఎం కుర్చీ రక్షణ కోసం సొంత ఎమ్మెల్యేల కదలికలపై సిద్దరామయ్య నిఘా వేసినట్లు ఆరోపించారు కేంద్రమంత్రి కుమారస్వామి. ఇదిలా ఉండ‌గా పాలు, తేనెల్లాంటి డీకే శివ కుమార్‌కు, నాకు మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి విమర్శలు చేస్తున్నారంటూ జవాబిచ్చారు సీఎం సిద్దరామయ్య. అయితే నాకు ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని, సీఎం కుర్చీ ఖాళీ అయిన తర్వాతే తన ప్రయత్నాలు మొదలవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.
The post ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లైడీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లై

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తమిళనాడు ప్రజల సంక్షేమాన్ని తన విధానంగా స్వీకరించిన

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

    దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు జైపుర్, లఖ్‌నవూ, వారణాసి, ఇతర

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎంరాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం

విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం విజ‌య‌న‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సినేష‌న్ అనేది ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల‌ని