hyderabadupdates.com movies బాలయ్య గ్రీన్ మ్యాట్ పంచులు భేష్

బాలయ్య గ్రీన్ మ్యాట్ పంచులు భేష్

అప్పుడప్పుడు అభిమానుల పట్ల కాస్త దూకుడుగా ఉన్నా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. ఒక్కోసారి మిస్ ఫైర్ అయినా సరే ఆయనేమి మొహమాటపడడు. తాజాగా ఇప్పటి హీరోల ధోరణి గురించి వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. తాను కేవలం ఎన్టీఆర్ వారసుడిగా ఎదగలేదని, కస్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, సినిమాల పట్ల జ్ఞానం కసి తపన ఇంతవాడిని చేశాయని, కానీ ఇప్పుడంతా టెక్నాలజీ మయం అయిపోయి ఒరిజినాలిటీ కనిపించడం లేదని, సెట్స్ కి రాకుండా గ్రీన్ మ్యాట్స్ లో షూటింగ్ చేస్తున్న హీరోల్లా తాను డూప్లికేట్ కాదని, ఒరిజినల్ అని కుండబద్దలు కొట్టేశారు.

ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ బాలకృష్ణ మాటల్లో నిజాలు లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ హష్మీ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. షూటింగ్ కి రాకుండా మేనేజ్ చేస్తున్న హీరోలను చూస్తున్నానని పెద్ద బాంబు వేశాడు. ఇప్పుడు బాలయ్య దాన్ని డిస్కషన్ వైపు మళ్లించారు. సాంకేతికత పెరిగిపోయి ఏఐ లాంటివి వచ్చాక నిజమేదో అబద్దమేదో గుర్తించడం ప్రేక్షకులకు కష్టంగా మారింది. నిజంగా తాము అభిమానించే హీరోనే ఫైట్లు చేశాడా లేక డూప్ ని పెట్టి ఏఐతో మేనేజ్ చేశారా అనేది సామాన్యులు పసిగట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆడియన్స్ ని మోసం చేయడం మరింత తేలికైపోయింది.

రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. మేడం టుస్సాడ్ మ్యూజియం కోసం ముఖకవళికలు, శరీర కొలతలు తీసుకున్నట్టు భవిష్యత్తులో స్టార్ హీరోలకు ఇలాగే తీసుకుని ఏకంగా ఏఐ లోనే సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు సీనియర్లకు ఇలాంటి సౌలభ్యాలు లేవు. చిరంజీవి నిజంగానే రైల్వే బ్రిడ్జి మీద వేలాడాల్సి వచ్చింది. బాలకృష్ణ కురూపి వేషంలో ముప్పై సంవత్సరాల క్రితం క్లిష్టమైన ప్రోస్తెటిక్స్ మేకప్ వేసుకున్నారు. కమల్ హాసన్, విక్రమ్ సంగతి సరేసరి. ఇప్పటి హీరోలకు అంత సవాళ్లు, ఛాలెంజులు లేవన్నది బాలయ్య ఉద్దేశం. టెక్నాలజి చేస్తున్న ముప్పుని బాగానే పసిగట్టారు.

Related Post

ఇండో పాక్ మ్యాచ్.. మొదలవకముందే ఓ టెన్షన్ఇండో పాక్ మ్యాచ్.. మొదలవకముందే ఓ టెన్షన్

​క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పుడు వాతావరణం రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది. ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ పోరుపై వర్షం ముప్పు పొంచి

జంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీంజంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం మ‌రోసారి సుప్రీంకోర్టులో విచారణ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో త‌న‌కు స‌మ‌యం కావాలంటూ.. స్పీక‌ర్