hyderabadupdates.com Gallery బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : టాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టులు విస్తృతంగా వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఎవ‌రికి వారు వివిధ రంగాల‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీస్తున్న వార‌ణాసిలో న‌టిస్తున్నాడు. త‌న‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ , ప్రియాంక చోప్రా, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే మ‌హేష్ బాబు త‌న స్వంత వ్యాపారంలో భాగంగా ఏఎంబీ పేరుతో ఐమాక్స్ థియేట‌ర్ల‌ను ప్లాన్ చేశాడు. హైద‌రాబాద్ లో ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. భారీ లాభాల‌ను తెచ్చి పెడ‌తోంది. ఈ త‌రుణంలో త‌న వ్యాపారాన్ని ఇత‌ర మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల‌కు కూడా విస్త‌రింప చేశాడు.
ఇందులో భాగంగా క‌ర్ణాట‌క రాజధాని బెంగ‌ళూరులో ఏఎంబీ థియేట‌ర్ ను ఓపెన్ చేశాడు. ఇది హాట్ టాపిక్ గా మారింది సినీ వ‌ర్గాల‌లో. మహేష్ బాబు ప్రస్తుతం తన అద్భుతమైన చిత్రం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రో వైపు వ్యాపారంపై ఫోక‌స్ పెట్టాడు. బెంగళూరులో తన ప్రతిష్టాత్మక థియేటర్ ని ప్రారంభించడానికి సమయం తీసుకున్నారు. ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవానికి వ్యక్తిగతంగా హాజరవుతున్న‌ట్లు సినీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. అయితే అధికారికంగా గ‌త జ‌న‌వ‌రి నెల 16న లాంచ్ అయ్యింది. మ‌హేష్ బాబు కు చెందిన థియేట‌ర్ బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ ప‌ట్ట‌ణం గాంధీ న‌గ‌ర్ లో ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది అత్యాధునిక స్క్రీన్లు ఉన్నాయి. దాదాపు 600 మంది కూర్చునేలా దీనిని తీర్చిదిద్దారు. 2019 నుంచి ఆసియా సినిమా స్ తో క‌లిసి త‌న వ్యాపారానికి శ్రీ‌కారం చుట్టాడు ప్రిన్స్.
The post బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాంచంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాం

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా త‌న స్వంత ఊరు నారా వారి

VVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులుVVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులు

    బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్‌ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం… ఓ సహాయ రిటర్నింగ్‌ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్‌ చేయడంతో పాటు

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు