hyderabadupdates.com Gallery బ్యాంకు ఖాతాదారుల‌కు ఆర్బీఐ కోలుకోలేని షాక్

బ్యాంకు ఖాతాదారుల‌కు ఆర్బీఐ కోలుకోలేని షాక్

బ్యాంకు ఖాతాదారుల‌కు ఆర్బీఐ కోలుకోలేని షాక్ post thumbnail image

హైద‌రాబాద్ : బ్యాంకు ఖాతాదారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర స‌ర్కార్. ఈ మేర‌కు ఆర్బీఐ కీల‌క మార్పులు చేసింది. ఏప్రిల్ 1 బుధ‌వారం నుంచి డ‌బ్బుల లావాదేవీల‌కు సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైంది, దీనితో పాటు పన్ను విధానం, బ్యాంకింగ్, పదవీ విరమణ పొదుపులు, రోజువారీ ఖర్చులకు సంబంధించిన అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి.
కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలుపైనే ప్రధాన దృష్టి ఉన్నప్పటికీ, ఏటీఎం విత్‌డ్రాలు , ఈపీఎఫ్‌ వాటాల నుండి పాన్ నియమాలు , ఎల్పీజీ ధ‌ర‌ల వ‌ర‌కు అనేక ఇత‌ర ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూపించ‌నున్నాయి. ఇదంతా ఖాతాదారుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది స‌ర్కార్. ప్ర‌ధానంగా ఆర్థిక నియమాలలో 7 ప్రధాన మార్పులు చేసింది.
ఇవాల్టి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు లోకి వ‌చ్చింది. అత్యంత భారీ నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇటీవల నోటిఫై చేయబడిన ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ ప్రకారం, కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ పాత నిబంధనలను తొలగించింది. మరింత సరళీకృత వ్యవస్థను ప్రవేశ పెట్టడం ద్వారా పన్ను నిబంధనల పాటించడాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం , అసెస్‌మెంట్ సంవత్సరం అనే విభజన స్థానంలో ట్యాక్స్ ఇయ‌ర్ అనే కొత్త ప‌దాన్ని చేర్చింది ఆర్బీఐ.
కొత్త పన్ను విధానమే డిఫాల్ట్ ఎంపికగా కొనసాగుతుంది, తద్వారా తక్కువ మినహాయింపులతో కూడిన ఈ సరళీకృత విధానం వైపు ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులను ఇది ప్రోత్సహిస్తుంది. రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలలో కూడా మార్పులు రానున్నాయి. బ్యాంకులు ఏటీఎం విత్‌డ్రాయల్ నిబంధనలను సవరిస్తున్నాయి, ఇందులో ఉచిత లావాదేవీల పరిమితులు కఠిన‌త‌ర చేశాయి. ఆపై భారీగా ఛార్జీలు వ‌డ్డిస్తున్నాయి. ఏటీఎంల నుండి యూపీఐ ఆధారిత నగదు విత్‌డ్రాయల్స్ కూడా ఈ పరిమితుల్లోనే లెక్కించ బడతాయని స్ప‌ష్టం చేసింది.
The post బ్యాంకు ఖాతాదారుల‌కు ఆర్బీఐ కోలుకోలేని షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానంశివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్