hyderabadupdates.com movies మట్కాని చూపించే పద్దతి ఇది

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ ‘మట్కా’ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది. పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా జనాన్ని కనీస స్థాయిలో మెప్పించలేక డిజాస్టర్ అయ్యింది. మట్కా డాన్ గా పేరొందిన రతన్ ఖత్రి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని మెప్పించేలా చూపించడంలో ఫెయిలయ్యారు. తాజాగా ఇదే కథతో ‘మట్కా కింగ్’ వెబ్ సిరీస్ వచ్చింది.

1965 నుంచి 1975 మధ్య కాలాన్ని నేపధ్యంగా తీసుకున్నారు. పత్తి వ్యాపారం మాటున జూదం నిర్వహించే లాల్ జీ(గుల్షన్ గ్రోవర్) దగ్గర గుమస్తాగా పని చేసే బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) డబ్బు అవసరమై విభేదాలు తెచ్చుకుని స్వంతంగా మట్కా బిజినెస్ మొదలుపెడతాడు. పది ఇరవై పైసలతో మొదలుపెట్టి లక్షలు కోట్ల టర్న్ ఓవర్ కు చేరుకుంటాడు. ప్రభుత్వాలు సైతం ఏం చేయలేని మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. చివరిని అతని ప్రయాణం ఏమయ్యిందనేది అసలు స్టోరీ.

ఇక్కడ సింపుల్ గా చెప్పినా అసలు సిరీస్ లో చాలా డెప్త్ ఉంటుంది. బ్రిజ్ భట్టి ఒక్కో ఇటుకను పేరుస్తూ, నిజాయితీగా ఉంటూ పేదోళ్ల మనసులు గెలుచుకోవడం, తన నల్ల డబ్బుని వైట్ లో మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాటరీ టికెట్లను వాడుకోవడం లాంటివి బాగా పేలాయి. ఎనిమిది ఎపిసోడ్లు ఒక్కొక్కటి సుమారు యాభై నిమిషాల నిడివి ఉండటంతో కొంత స్లోగా అనిపించినా చివరి దాకా చూడొచ్చు అనిపించేలా చేయడంలో దర్శకుడు నాగరాజ్ మంజులే సక్సెసయ్యాడు.

తెలుగులో తీసిన మట్కా, ఇప్పుడీ మట్కా కింగ్ కానీ ఎక్కడా రతన్ ఖత్రీ లైఫ్ ని తీసుకున్నామని చెప్పలేదు. కానీ అప్పటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్లకు ఇది ఎవరి గురించో అర్థమైపోతుంది. నటుడిగా విజయ్ వర్మ ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నాడు. క్యాస్టింగ్ చాలా బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే స్కామ్ 1992తో పోలిస్తే మాత్రం అంత డెప్త్, ఇంటెన్సిటీ ఇందులో తగ్గిందని చెప్పాలి. అయినా సరే వన్ టైం వాచ్ విభాగంలో వేయొచ్చు.

Related Post

జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయిందిజగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది

మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం నిన్నటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత వైరల్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని