hyderabadupdates.com Gallery మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి

మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి

మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి post thumbnail image

హైద‌రాబాద్ : ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి. ఆదివారం ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. ఊరికే మహానుభావులు కాలేదని వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే మహానుభావులు అయ్యారని అన్నారు. ఎన్టీఆర్ కు మరణంల లేదని చెప్పారు. నమ్ముకున్న ఆశయం కోసం, తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్నికొనసాగిస్తానని చెప్పేవారన్నారు. అంతే కాకుండా సింహం ఎప్పుడూ పచ్చ గడ్డి తినదు..సింహం ఎప్పుడూ పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు.
తాను కూడా వెన్నుపోటుదారులపై యుద్ధం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు లక్ష్మీ పార్వ‌తి . కానీ ఆయన శపతం నెరవేరక ముందే కన్నుమూయాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చేవాళ్లు చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ చివరికోరిక సగం తీరిందని, కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడంపై డ్రామా జరుగుతుందన్నారు. భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ బతికే ఉంటారని సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. ఎన్టీఆర్ తన దేవుడు అని, తనను ఎన్టీఆర్ తమ్ముడు అని సంభోదించే వాడని చెప్పారు. ఆయన మళ్లీ పుట్టి నటుడుగా ఓ వెలుగు వెలగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ తిరిగి వస్తాడని తాను నమ్ముతానని, ఆయన శకపురుషుడని వ్యాఖ్యానించారు.
The post మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్ద‌రామ‌య్య మ‌రో వైపు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ మ‌ధ్య

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకోరాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి నోరు విప్పారు. ఆయ‌న ఏబీఎన్ రాధాకృష్ణ‌పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి టెండ‌ర్ల ర‌ద్దుపై

Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్