hyderabadupdates.com Gallery మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు post thumbnail image

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీలో మ‌ద్యం స్కాంకు సంబంధించి ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు ​​జారీ చేసింది. జనవరి 22న తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న పాత్ర‌, సంబ‌ధిత ఆర్థిక లావాదేవీల‌పై ఆరా తీయ‌నుంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక ఉన్న‌ట్టుండి మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి న‌మ్మిన బంటుగా, నెంబ‌ర్ 2 గా ఉన్నారు విజ‌య సాయి రెడ్డి. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ వ‌రుస ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విజ‌య సాయి రెడ్డి ఉన్న‌ట్టండి తాను వైఎస్సార్సీపీ నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.
అంతే కాకుండా పార్టీ ప‌రంగా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ పార్టీ కి పూర్తిగా దూరంగా ఉండేందుకు గాను తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ప‌లు ఊహాగానాల మధ్య ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వెళ‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌ట‌స్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈడీ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న‌కు పెద్ద దెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నాటి నుంచి త‌న త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన వ్య‌క్తిగా ఉన్నారు విజ‌య‌సాయి రెడ్డి.
The post మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నేతన్నల కుటుంబాల్లో నేటి నుంచి వెలుగులునేతన్నల కుటుంబాల్లో నేటి నుంచి వెలుగులు

అమరావతి : రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరో పరిశ్రమ అభివృద్ధికి

రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణంరూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం

హైద‌రాబాద్‌: ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం.. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన క్షేత్రం పునః నిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించు కోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం

11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ

హైద‌రాబాద్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న తార‌, టీవీకే గ‌ణేష్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.