hyderabadupdates.com Gallery మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ post thumbnail image

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫ‌రెంట్ క‌థ‌తో ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , శ్రీ‌లీల‌తో క‌లిసి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తెర‌కెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సాంగ్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా ఈ సినిమా గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. వ‌చ్చే మార్చి నెల‌లో ఉస్తాద్ భ‌గ‌త్ రానుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మూవీ మేక‌ర్స్. ఇదిలా ఉండ‌గా త‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి కొడుకు, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ‌, జాహ్న‌వి క‌పూర్ క‌లిసి బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పెద్ది మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ ఉస్తాద్ భ‌గత్ సింగ్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డంతో పెద్ది మూవీ వాయిదా ప‌డే ఛాన్స్ ఉందని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. అయితే హ‌రీష్ శంక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ‌కు మార్చి వీల‌వుతుంద‌ని, అందుకే దానిని సెంటిమెంట్ గా భావించి రిలీజ్ కు సిద్దం చేశామ‌న్నాడు. దీంతో అటు ఉస్తాద్ ఇటు పెద్ది మ‌ధ్య వార్ కొన‌సాగేందుకు వీలు లేదు. ఎందుకంటే అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం విశేషం. ఒక‌రు అబ్బాయి మ‌రొక‌రు బాబాయ్. ఇక వాస్త‌వానికి పెద్ది మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇది కూడా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది. ఇక రెండు సినిమాలు క్లాష్ కాకుండా తేదీలు మారే ఛాన్స్ ఉంది. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించారు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను.
The post మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ నారీ శ‌క్తి వంద‌న్ కు మ‌ద్ద‌తివ్వండిమ‌హిళా రిజ‌ర్వేష‌న్ నారీ శ‌క్తి వంద‌న్ కు మ‌ద్ద‌తివ్వండి

అమ‌రావ‌తి : మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’‌కు పార్లమెంట్‌లో మద్దతుపై రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం