hyderabadupdates.com Gallery రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి నోరు విప్పారు. ఆయ‌న ఏబీఎన్ రాధాకృష్ణ‌పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి టెండ‌ర్ల ర‌ద్దుపై స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నిప్పులు చెరిగారు రాధాకృష్ణ‌. ఆధారాలు లేకుండా ఎలా దుష్ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇలాగే నువ్వు గీత దాటితే ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు సైతం తాను వెనుకాడ‌బోనంటూ స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని అనుమానం వ్య‌క్తం చేశారు. రాధాకృష్ణ తొలి పలుకుల నినాదం వెనుక ఎవరి హస్తం ఉందో తానే చెప్పాల‌న్నారు. ఏ రాబందులా? ఏ గద్దల? ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు ప్ర‌సారం చేశార‌నేది తేలాల్సి ఉంద‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావు లేద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగా నిలిచిన సింగరేణి సంస్థపై పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలతో రాధాకృష్ణ చేస్తున్న తొలి పలుకు కథనాలు సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య చర్యలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియాకు కూడా హ‌ద్దు అనేది ఉంటుంద‌న్నారు. దానిని గ‌మ‌నించి న‌డుచు కోవాల‌ని హిత‌వు ప‌లికారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.
The post రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యంబౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

ల‌క్నో : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్థి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టును ఓడించింది. రెండు ఓట‌ముల త‌ర్వాత ద‌క్కిన విజ‌యం ఇది. ఆతిథ్య జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎంఅన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎం

ప‌ల్నాడు జిల్లా : పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్తుల ఆకలి

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh : సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారానికి నిర్వహించే ‘సమాధాన్‌ దివస్‌’ (ప్రజా ఫిర్యాదుల దినం)లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అర్జీ చూసి యూపీలోని (Uttar Pradesh) సీతాపుర్‌ కలెక్టర్‌ నివ్వెరపోయారు. తన భార్య నసీమున్‌ రాత్రిపూట