hyderabadupdates.com Gallery రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్

రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్

రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్ post thumbnail image

జ‌గిత్యాల జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి రెచ్చి పోయారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈనెల 20వ తేదీన కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈమేర‌కు ల‌క్ష మందికి పైగా హాజ‌ర‌య్యేలా స‌భ‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో బుధ‌వారం జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా సుదీర్ఘ రాజ‌కీయ అనుభం క‌లిగిన‌, మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా ఎదిగారు . మంత్రిగా ప‌ని చేశారు. నిజాయితీగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రితో క‌లుపుగోలుగా ఉంటూ వ‌చ్చారు జీవ‌న్ రెడ్డి. అందుకే తాను బీఆర్ఎస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
రేవంత్‌ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ప‌ట్టు కోల్పోయిందన్నారు జీవ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని వాపోయారు. నిజాయితీ, నిబ‌ద్ద‌త , అనుభ‌వం క‌లిగిన నేత‌ల‌కు ఆ పార్టీలో స్తానం లేద‌న్నారు. అక్క‌డ ఉండ‌లేక పోతున్నార‌ని, కావాల‌ని అలా చేస్తున్నాడ‌ని రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు జీవ‌న్ రెడ్డి. త‌న‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేల‌కు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ నా వయసును గౌర‌విస్తార‌ని, త‌న‌ను అన్నా అని ఆప్యాయంగా పిలుస్తార‌ని చెప్పారు. కేసీఆర్ కు ప్ర‌జ‌లంటే పంచ ప్రాణం అని, నీలాగా కాదంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.
The post రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

యువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలియువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలి

అమ‌రావ‌తి : యువ‌తీ యువ‌కులు స్వామి వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పాటిస్తూ యువత

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణంKinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

    భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచంతో

సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధిసృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి

విజ‌యవాడ : పవిత్ర కృష్ణా నది తీరాన ప్రారంభమైన ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవనుందని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడలో జరిగిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న