hyderabadupdates.com Gallery రైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యం

రైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యం

రైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యం post thumbnail image

అమ‌రావ‌తి : రైతుల‌కు స్థిరమైన ఆదాయం క‌ల్పించ‌డం త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోను అనుసరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579 ధర లభించిందని చెప్పారు. ఇది గత 10 సంవత్సరాల్లో అత్యధిక సగటు ధరగా నమోదు అయిందని తెలిపారు మంత్రి. ఇప్పటి వరకు రూ.18,128.48 లక్షల నిధులు విడుదల చేశామ‌న్నారు. అందులో రూ.13,425.02 లక్షలు నేరుగా రైతుల ఖాతాల్లో వేశామ‌న్నారు అచ్చెన్నాయుడు . ఇప్పటివరకు 24,130 హెక్టార్లలో కొత్త ఆయిల్ పామ్ విస్తరణ సాధించామని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర రైతులకు గరిష్ట లాభాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ధరలు పడిపోతున్న సమయంలో రైతులకు భరోసా ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత నెగిటివ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ రైతుల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలిసి కూడా, ధరలు పడిన ప్రతిసారి మరింత భయం కలిగించే వ్యాఖ్యలు చేస్తూ మార్కెట్‌ను ఇంకా పతనమయ్యేలా చేశారని ఆరోపించారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ధరలు పడుతున్న సమయంలో ఏ రాజ‌కీయ నేత అయిన రైతుల వెన్నంటి ఉండాల్సి ఉండగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయ లాభం కోసం రైతుల భవిష్యత్తుతో చెలగాటం ఆడారని మండిపడ్డారు.
రైతులకు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం వలననే నేడు మిర్చి, పామాయిల్ ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. రైతులు సంతోషంగా ఉన్నారని, ఇదే కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. పామాయిల్ పంటలను మరింత ప్రోత్సహించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌లో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ రాయితీలను ఎగ్గొట్టి రైతులను నిరాశపరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది లక్ష హెక్టార్లకు పైగా డ్రిప్ ఇరిగేషన్‌ను అమలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఇది వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక మార్పులకు దారితీస్తుందని స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెరగడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ధరల స్థిరత్వం, సాగు ఖర్చుల తగ్గింపు, ఆధునిక పద్ధతుల అమలే తమ విధానమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు మాటలతో కాదు, చర్యలతో మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఆయన తేల్చిచెప్పారు.
The post రైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan Visits Kakinada, Promises Aid to FisherfolkPawan Kalyan Visits Kakinada, Promises Aid to Fisherfolk

Kakinada: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited the Kakinada Collectorate to engage with fishing community representatives from Uppada and state officials. During the meeting, fishermen highlighted the adverse

CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశంCM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదంTG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

    జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న