hyderabadupdates.com Gallery విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ – 2026 నివేదిక బ‌క్వాస్ అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రెండు నెలల రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మూడు రోజుల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం‌కు విద్యా విధానంపై నివేదిక ఇచ్చారని అన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్ఎస్పీ. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగిందన్నారు. ఆకునూరి ముర‌ళి కావాల‌ని సీఎం చెప్పిన‌ట్టు నివేదిక త‌యారు చేశార‌ని, లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ వాపోయారు.
ఉపాధ్యాయుల జీతాలను విద్యా కమిషన్ కాదు, పీఆర్‌సీ నిర్ణయించాల్సి ఉంటుంద‌న్నారు. ఆ మాత్రం విష‌యం తెలుసుకోకుండా నివేదిక ఇవ్వ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఆర్ఎస్పీ. ఒళ్లంతా విషం నింపుకుని ఆకునూరి మురళి ఈ రిపోర్టును తయారు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఏ మాత్రం సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని మురళి ఎలా అంటారని ప్ర‌శ్నించారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్‌లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారంటూ వాపోయారు. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్టుతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర‌కు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు.
The post విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Madvi Hidma: మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హిడ్మా హతంMadvi Hidma: మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హిడ్మా హతం

    మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ

స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సీక్వెల్ చిత్రం బోర్డ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది భారీ అంచ‌నాల మ‌ధ్య‌. ఎవ‌రూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్

మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమ‌రావ‌తి : మత్స్యకారుల పొట్టకొట్టేలా జగన్ రెడ్డి తెచ్చిన దుర్మార్గమైన జీవో నంబర్ 217ను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేర‌కు వేలాది మంది గంగ‌పుత్రుల‌కు మేలు చేకూరేలా నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు రాష్ట్ర మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. శ‌నివారం