hyderabadupdates.com Gallery విద్వేష ప్ర‌చారం అత్యంత‌ ప్ర‌మాద‌క‌రం

విద్వేష ప్ర‌చారం అత్యంత‌ ప్ర‌మాద‌క‌రం

విద్వేష ప్ర‌చారం అత్యంత‌ ప్ర‌మాద‌క‌రం post thumbnail image

చెన్నై : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రి మార‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్నేళ్లుగా సినీ రంగంలో విప‌రీత ధోర‌ణ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆరోపించారు. ఆయ‌న ప‌రోక్షంగా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ మూవీ గురించి స్పందించారు. ఈ మ‌ధ్య వ‌రుస‌గా విద్వేష ప్ర‌చారానికి ప్ర‌యారిటీ ఇస్తూ సినిమాలు వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు. ఏ ప్రాజెక్ట్ పేరు ప్రస్తావించకుండా ప్రచారానికి ప్రజల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే శక్తి ఉందని అన్నారు. అందుకు ఉదాహరణగా పెద్ద నోట్ల రద్దును వెట్రిమారన్ పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేష ప్రచార చిత్రాలను విమర్శించడంతో చర్చకు తెరలేపారు. అభిమానులు ఆయన వ్యాఖ్యలను ధురందర్ 2తో ముడిపెట్టారు. నీలిర‌ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
హింస లేదా ద్వేషంతో వందల కోట్లు సంపాదించాలనే ఆశతో, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించే సినిమాలు చాలా ఉన్నాయన్నారు వెట్రి మార‌న్. ఈ రోజుల్లో ప్రతీదీ ప్రచారంగా మారుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రచారానికి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే శక్తి ఉంద‌న్నారు. దీనికి ఉదాహరణగా పెద్ద నోట్ల రద్దును వెట్రిమారన్ పేర్కొన్నారు. జ్ఞాపకాలు చాలా చంచలమైనవి, ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితమయ్యారో, ప్రజలు బారులు తీరినప్పుడు ఎన్ని ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ మనం దాని ప్రభావాన్ని సులభంగా మార్చగలం. కాబట్టి, విద్వేష ప్రచారానికి వ్యతిరేకంగా మనం ఏమి చేయగలం? అని అన్నారు ద‌ర్శ‌కుడు.
The post విద్వేష ప్ర‌చారం అత్యంత‌ ప్ర‌మాద‌క‌రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడుభట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు

హైద‌రాబాద్ : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల కార్డు పట్టుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని భట్టి విక్రమార్క చెప్పాడ‌ని, ఇప్పుడు వాటి ఊసెత్త‌డం లేద‌న్నారు. ఇప్పుడు

సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం : అచ్చెన్నసహజ వ్యవసాయానికి ప్రోత్సాహం : అచ్చెన్న

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ సహజ వ్యవసాయం (APCNF) ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. ప్రస్తుతం 8,168 గ్రామాల్లో 13.10 లక్షల ఎకరాల్లో సహజ వ్యవసాయం సాగుతోందన్నారు. రైతులకు అవసరమైన ఇన్‌పుట్లు అందించేందుకు

1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం

ములుగు జిల్లా : ఈసారి జ‌రిగిన మేడారం జాత‌ర‌ను రికార్డు స్థాయిలో 1.55 కోట్ల మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెల్ల‌డించారు. త‌ను మంత్రి దాస‌రి సీత‌క్క‌తో క‌లిసి ప‌ర్య‌టించారు మేడారాన్ని. ఈ సందర్భంగా