hyderabadupdates.com Gallery వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం post thumbnail image

తిరుపతి : శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి చూపిన మహా కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. ఆమె 296వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ మురళి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – ద్విపద భాగవతం” అనే అంశంపై ప్రసంగించారు. బమ్మెర పోతన శైలిని అనుసరిస్తూనే స్వతంత్ర భావాలతో వెంగమాంబ శ్రీభాగవతాన్ని ద్విపద కావ్యరూపంలో రచించారని తెలిపారు. ఇందులో శ్రీకృష్ణుడి దివ్యరూపాన్ని అత్యంత సుందరంగా చిత్రించారని వివరించారు. అలాగే శతకాలు, యక్షగానాలు, “శ్రీ వేంకటాచల మహత్యం” వంటి గ్రంథాల ద్వారా భక్తి సాహిత్యానికి విశిష్టమైన సేవలందించారని కొనియాడారు.
నగరి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. వరలక్ష్మీ “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహత్యం” అంశంపై మాట్లాడుతూ, సంస్కృతంలో విస్తృతంగా ఉన్న పురాణ విషయాలను వెంగమాంబ సులభమైన భాషలో ఆరు ఆశ్వాసాలలో సమగ్రంగా అందించారని అన్నారు. ముఖ్యంగా శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని భక్తులకు సులభంగా అర్థమయ్యేలా అందించారని పేర్కొన్నారు.
టీటీడీ ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డా. నరసింహాచార్యులు “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – సాహిత్య సంవీక్షణం” అంశంపై మాట్లాడుతూ, తెలుగు భక్తి సాహిత్యంలో వెంగమాంబకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఆమె రచనల్లో శ్రీవేంకటేశ్వర స్వామిపై అచంచల భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి, తాత్విక దృక్పథం సమన్వయంగా ప్రతిఫలిస్తాయని వివరించారు. “ద్విపద భాగవతం”లో శ్రీకృష్ణ లీలలను ప్రత్యేకంగా ఆవిష్కరించారని, “శ్రీ వేంకటాచల మహత్యం” వంటి కృతుల ద్వారా తిరుమల క్షేత్ర మహిమను విశ్వవ్యాప్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు.
The post వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు ధురంధ‌ర్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటనపోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ