hyderabadupdates.com Gallery సంప‌ద సృష్టించే మార్గ‌ద‌ర్శ‌కులు కావాలి : సీఎం

సంప‌ద సృష్టించే మార్గ‌ద‌ర్శ‌కులు కావాలి : సీఎం

సంప‌ద సృష్టించే మార్గ‌ద‌ర్శ‌కులు కావాలి :  సీఎం post thumbnail image

విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రా యూనివ‌ర్శిటీ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు, ప్ర‌ముఖ క్రికెట‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, మంత్రి నారా లోకేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాన‌ని, రోజులు మారాయని, సాధారణ మనుషులు అసాధారణ శక్తిగా మారే అవకాశం మనకు ఉందన్నారు సీఎం. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లపై దృష్టి పెట్టండి అని కోరారు. యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చే విద్యా కేంద్రాలే కాదు… సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని పిలుపునిచ్చారు చంద్ర‌బాబు నాయుడు.
పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి అని అన్నారు. మీరు ఉద్యోగం చేయడం కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే శక్తి మీకు రావాలని కోరారు. దీనికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందని ప్ర‌క‌టించారు. వీసీని కోరుతున్నా ఏయూకు బ్రాండ్ ఉంది. మీరు అడిగితే ప్రపంచంలోని చాలా యూనివర్సిటీలు మీతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పారు సీఎం. వంద దేశాల విద్యార్థులు మన యూనివర్సిటీల్లో చదివేలా సిద్ధం చేయాలన్నారు. సంపద సృష్టించే మార్గదర్శులుగా మారే అవకాశం మీకు ఉందని జోష్యం చెప్పారు. ఎంట్రప్రెన్యూర్లుగా ఏయూ ఎంతమందిని తయారు చేస్తుందనేది మీ మీద ఆధారపడి ఉంద‌న్నారు.
The post సంప‌ద సృష్టించే మార్గ‌ద‌ర్శ‌కులు కావాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ కార్పొరేట్ల‌కు వంతం పాడుతూ కీల‌క‌మైన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి తూట్లు పొడి చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పరిరక్షణ

త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీత్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్

రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్ర‌తి ఏటా ప్ర‌భ‌ల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వ‌హిస్తామ‌ని, ఈ మేర‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపార‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ