hyderabadupdates.com movies సలహాదారు పదవి వద్దనుకున్న మంతెన

సలహాదారు పదవి వద్దనుకున్న మంతెన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యోగా, నేచురోపతి విభాగం ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ నియామకం క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో జీతభత్యాలు, ప్రభుత్వ సదుపాయాలు లభించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంతెన, అయితే మొదటి నుంచే నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.

క్యాబినెట్ హోదాతో వచ్చే ఎలాంటి జీతం, భత్యాలు, ప్రభుత్వ వాహనం, కార్యాలయ సదుపాయాలు, ప్రయాణ టిక్కెట్లు, సిబ్బంది ఖర్చులు వంటి సౌకర్యాలను స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల సొమ్ము తీసుకోవడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని, గత 35 ఏళ్లుగా ఎవరి నుంచీ రూపాయి గానీ, బహుమతి గానీ తీసుకోలేదని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలదేనని, అలాంటి ధనాన్ని స్వీకరించడం తాను చేసిన పాపంగా భావిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షరతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తెలిపారు.

ఇటీవల ఈ నియామకం గురించి మాట్లాడిన డాక్టర్ మంతెన, తొలుత ఈ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. వ్యక్తిగత నియమాలకు విరుద్ధమని భావించి, కేవలం వెనకుండి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.

అయినప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థనను గౌరవిస్తూ సలహాదారుగా కొనసాగేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది.

Related Post

#BB4 Akhanda 2: Thandavam, Theatrical Release On December 5th#BB4 Akhanda 2: Thandavam, Theatrical Release On December 5th

God Of Masses Nandamuri Balakrishna, Blockbuster Maker Boyapati Sreenu, Raam Achanta, Gopi Achanta, 14 Reels Plus, M Tejaswini Nandamuri Presents #BB4 Akhanda 2: Thandavam, Theatrical Release On December 5th God

సొంత గడ్డపై విజయ్ రష్మిక వ్రతంసొంత గడ్డపై విజయ్ రష్మిక వ్రతం

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి తొలిసారి సొంతూరికి చేరుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మనపేటలోని తన ఫామ్ హౌస్‌లో ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో వివాహం ముగిసిన అనంతరం

కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?

సొంత పార్టీ పెట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. తన పార్టీకి సంబంధించిన ప‌నిని ప్రారంభించేశారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు