hyderabadupdates.com Gallery సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాల ద్వ‌యం మ‌రోసారి త‌మ‌కు కొర కొర‌రానిదిగా త‌యారైన సామాజిక మాధ్య‌మాల‌పై నియంత్రించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా గ‌తంలో తీసుకు వ‌చ్చిన నియంత్ర‌ణ బిల్లులో మ‌రిన్ని స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ప్ర‌తిపాదించారు ఇవాళ పార్ల‌మెంట్ సాక్షిగా.
ఈ మేర‌కు భారత ప్రభుత్వం ‘సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నియమాలు, 2021స బిల్లుకు మరిన్ని సవరణలను ప్రతిపాదించింది . డిజిటల్ రంగంలో నియంత్రణను పటిష్టం చేయడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం , తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడం లక్ష్యంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే చాలా మందిని జైలు పాలు చేసింది. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ లేకుండా చేసేందుకే ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు ముందుకు తీసుకు వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా దీనిని వ్య‌తిరేకిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికలపై వార్తా సంబంధిత కంటెంట్‌ను పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వ్యక్తిగత వినియోగదారులను కూడా ‘సమాచార సాంకేతికత నియమాలు, 2021’ పరిధిలోకి తీసుకు వచ్చేలా భారత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీంతో వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ అనేది ఉండ‌దు. దీని ద్వారా ఎవ‌రినైనా స‌రే ఏదో ఒక కారణంతో నేరుగా కేసులు న‌మోదు చేయ‌వ‌చ్చు. ఆపై అదుపులోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. దీనిపై మేధావులు, బుద్ది జీవులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
The post సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసిచరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

హైద‌రాబాద్ : భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. రూ. 1000 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఇందులో కీల‌క పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ

తెలంగాణ రైజింగ్ విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్తెలంగాణ రైజింగ్ విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్

హైద‌రాబాద్ : తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ దేశానికే రోల్ మోడ‌ల్ గా మారింద‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లో బ‌యో స‌ద‌స్సు 2026ను ప్రారంభించి ప్ర‌సంగించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్రూస్

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణటిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

తిరుప‌తి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా