hyderabadupdates.com movies స్టాంపు సైజులో బాబు ఫోటో… వర్మ ఫైర్

స్టాంపు సైజులో బాబు ఫోటో… వర్మ ఫైర్

పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు.

స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో, ఈ రోజు ఈ కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం బాధాకరం అన్నారు.

ముఖ్యమంత్రి ఫొటో కూడా తీసివేయడం చాలా దారుణంగా ఉన్న పరిస్థితికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. తాను ఆవేశాన్ని అణుచుకున్నా కానీ.. కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు. 15 ఏళ్లు కలిసి ఉండాల్సిన ప్రభుత్వానికి అధికారులు ముందుగా చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మా నాయకుడికి గౌరవం ఇవ్వకపోతే మేం ఎలా ఉండగలం అని ప్రశ్నించారు. ఏ పార్టీని అగౌరవ పరిచినా మిగిలిన రెండు పార్టీలు తప్పు పట్టాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసి, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు వర్మ.

Related Post

పవన్ వార్నింగులను వైసీపీ లెక్క చేస్తుందా?పవన్ వార్నింగులను వైసీపీ లెక్క చేస్తుందా?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీమళ్లీ వైసిపికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప

విశ్వక్‌ను విశ్వకే కాపాడుకోవాలివిశ్వక్‌ను విశ్వకే కాపాడుకోవాలి

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. హీరోగా విజయాలు అందుకోవడం, స్టార్ ఇమేజ్-ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి అరుదైన ఘనతను అందుకున్న వాళ్లు.. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేయకపోవడం, సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోవడం ఆశ్చర్యం

‘రాయ‌చోటి’ ర‌గ‌డ‌.. అస‌లు రీజ‌నేంటి?‘రాయ‌చోటి’ ర‌గ‌డ‌.. అస‌లు రీజ‌నేంటి?

ప్ర‌స్తుతం ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ‘రాయ‌చోటి’ గురించే పెద్దె ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనిని అన్న‌మ‌య్య జిల్లా కేంద్రంగా తీసేయ‌డం.. త‌ర్వాత‌.. మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి క‌న్నీరు పెట్టుకోవ‌డం.. సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను ఓదార్చ‌డం వంటి