hyderabadupdates.com movies హరీష్, రవితేజ లేకపోతే ‘బచ్చన్’ బ్లాక్‌బస్టరయ్యేదా?

హరీష్, రవితేజ లేకపోతే ‘బచ్చన్’ బ్లాక్‌బస్టరయ్యేదా?

మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద షాకిచ్చినా.. వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘మిరపకాయ్’ మాత్రం సూపర్ హిట్టయింది. హరీష్‌కు కెరీర్లో అదే తొలి సక్సెస్. రవితేజకు కూడా అది మరపురాని సినిమాగా నిలిచింది. మళ్లీ ఈ కలయికలో ఎప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు చాలా ఏళ్లు ఎదురు చూశారు. చివరికి 2024లో జోడీ చేతులు కలిపింది. వీరి కలయికలో వచ్చిన మూడో సినిమా ‘మిస్టర్ బచ్చన్’ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

రీమేక్‌ సినిమాలను తనదైన శైలిలో రూపొందిస్తాడని పేరున్న హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్‌ చిత్రాల కోవలోనే మరో విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ హిందీ హిట్ ‘రైడ్’కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఐతే ఈ సినిమాకు అతి పెద్ద సమస్య తాను, రవితేజనే అంటున్నాడు హరీష్. తామిద్దరం లేకపోతే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని హరీష్ వ్యాఖ్యానించడం విశేషం.

హిందీ రైడ్ మంచి సినిమా అని, అందులో హీరో క్యారెక్టర్ తనకు బాగా నచ్చి ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నానని హరీష్ వెల్లడించాడు. ఐతే రెండు గంటల పాటు కేవలం ఐటీ రైడ్స్ మీదే సినిమాను నడిపిస్తే సోదిలా ఉంటుందన్న ఉద్దేశంతో తన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేశానన్నాడు.

ఐతే తాను, రవితేజ ఇద్దరం హిందీ పాటల పిచ్చోళ్లమని.. తాను హైదరాబాద్‌లో పెరగడంతో హిందీ కల్చర్, పాటలు తన మీద చాలా ప్రభావం చూపాయని.. రవితేజ మీద కూడా అలాంటి ప్రభావమే ఉందని హరీష్ చెప్పాడు. ఈ క్రమంలో తాను కుమార్ సాను పాటలతో మెడ్లీ లాంటిది ప్లాన్ చేశానని.. రవితేజ కూడా వాటి మీద ఆసక్తి చూపించాడని.. ఐతే సినిమాకు అదే పెద్ద మైనస్ అయిందని హరీష్ అభిప్రాయపడ్డాడు.

చాలామంది కుమార్ సాను ఎవరని అడిగారని.. ఆయన ఎవరో తెలియనపుడు తన పాటల గొప్పదనం ఏం తెలుస్తుందని హరీష్ వ్యాఖ్యానించాడు. ‘మిస్టర్ బచ్చన్’ స్క్రిప్టు నిజానికి సూపర్‌గా ఉంటుందని.. తాను రాసిన స్క్రిప్టును ఇంకో దర్శకుడు, హీరో కలిసి తీసి ఉంటే చాలా మంచి ఫలితం వచ్చేదని.. తాను, రవితేజ కలవడం వల్ల వేరే ట్రాక్‌లోకి వెళ్లిందంటూ.. కేవలం కుమార్ సాను పాటల ట్రాక్ వల్లే ఆ సినిమా పోయిందనే అర్థం వచ్చేలా హరీష్ శంకర్ మాట్లాడాడు.

కానీ ఆ ట్రాక్ కొంచెం మైనస్ అయిన మాట వాస్తవమే కానీ.. అంతకుమించిన లోపాలు సినిమాలో చాలా ఉన్నాయన్నది ప్రేక్షకుల మాట. హరీష్ రాసిన స్క్రిప్టుతో ఎవరు తీసినా ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేదన్న మాటను ఎవ్వరూ అంగీకరించలేరు. ఒరిజినల్ ‘రైడ్’లోని ఐటీ రైడ్స్ ఎపిసోడ్‌ను ఏమాత్రం ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయిన హరీష్.. ప్రథమార్ధంలో హీరో ఎలివేషన్లు, రొమాంటిక్ ట్రాక్‌ విషయంలోనూ నిరాశపరిచాడు. సెకండాఫ్ అయితే పూర్తిగా తేలిపోయింది. కాబట్టి హరీష్, రవితేజ చేయకపోయినా.. ఇంకెవరు టేకప్ చేసినా ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాపే అయ్యేదన్నది స్పష్టం.

Related Post

Thalaivar173: Shoot timelines & genre details of Rajinikanth’s next revealedThalaivar173: Shoot timelines & genre details of Rajinikanth’s next revealed

Superstar Rajinikanth is currently busy shooting for Jailer 2, the sequel to the 2023 blockbuster Jailer, directed by Nelson Dilipkumar. After wrapping up Jailer 2, Rajini will move on to