hyderabadupdates.com Gallery పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క‌మాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఢ‌మాల్

పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క‌మాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఢ‌మాల్

పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క‌మాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఢ‌మాల్ post thumbnail image

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను అల‌వోక‌గా ఛేదించింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది. ఏకంగా నిర్దేశించిన 265 ప‌రుగులను ఊదేసింది. ఐపీఎల్ హిస్ట‌రీలో అరుదైన రికార్డు న‌మోదు చేసింది పంజాబ్ . ఇరు జ‌ట్ల మ‌ధ్య ప‌రుగుల వ‌ర‌ద పారింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 264 ర‌న్స్ చేసింది. మ‌రో వైపు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ప‌ని పూర్తి చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్.
ముందు భారీ ల‌క్ష్యం ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా తొట్రుపాటుకు గురి కాలేదు పంజాబ్ ప్లేయ‌ర్లు. యంగ్ ఓపెన‌ర్స్ ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ కేవ‌లం 26 బంతులు ఎదుర్కొని 76 ర‌న్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి. ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఆ త‌ర్వాత కెప్టెన్ మ‌రోసారి బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను త‌గ్గరుండి గెలిపించాడు. కేవ‌లం 36 బ‌తులు ఎదుర్కొని 71 ర‌న్స్ చేశాడు అజేయంగా నిలిచాడు. ఇందులో 3 పోర్లు 7 సిక్సులు ఉన్నాయి. త‌ర్వాత ప్రియాంశ్ ఆర్య 17 బంతులలో 2 ఫోర్లు 5 సిక్సుల‌తో 43 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేశారు.
The post పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క‌మాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఢ‌మాల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేనుసంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను

ముంబై : భార‌త క్రికెట్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మంగ‌ళ‌వారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. అంద‌రూ త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామంYS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

  రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు

15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్

న్యూఢిల్లీ : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ వేదిక‌గా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హ‌బ్ చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. ఏకంగా 15 బిలియ‌న్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ