hyderabadupdates.com Gallery వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి

వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి

వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి post thumbnail image

జైపూర్ : ఐపీఎల్ 2026లో ప్లేస్ ఏదైనా స‌రే విజ‌యం మాత్ర‌మే త‌మ‌దేన‌ని నిరూపిస్తున్నారు ఇషాన్ కిష‌న్ నేతృత్వ‌లోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. తాజాగా జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో స‌త్తా చాటింది హైద‌రాబాద్. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మ‌రో వైపు చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య వంశీ కేవ‌లం 35 బంతుల్లో సెంచ‌రీ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. స‌న్ రైజ‌ర్స్ 5 వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి చేరుకోగా నాలుగో ప్లేస్ లోకి వెళ్లింది రాయ‌ల్స్. నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 18.3 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.
ఆదిలోనే ట్రావిస్ హెడ్ పెవిలియ‌న్ బాట ప‌ట్టినా ఎక్క‌డా తొణ‌క‌లేదు. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడాడు. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. ఇషాన్ కిష‌న్ 31 బంతుల్లో 74 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శ‌ర్మ 57 29 బాల్స్ ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. 11 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 132 ప‌రుగులు జోడించారు. నితీశ్ కుమార్ 36 ర‌న్స్ చేస్తే క్లాసెన్ 29 ప‌రుగులు చేశారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో బ్రిజేష్ 44 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చితే ఆర్చ‌ర్ 34 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
The post వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణటిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

తిరుప‌తి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా

యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావుయుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు

అమ‌రావ‌తి : బీసీల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ విశేష కృషి చేశారన్నారు మంత్రులు ఎస్. స‌విత‌, కొలుసు పార్థ‌సారథి. ఒడ్డే ఓబ‌న్న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. పేద‌ల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డిన అరుదైన రాజ‌కీయ

నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలినెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి

న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారాడు దేశ వ్యాప్తంగా. త‌ను కీల‌క‌మైన అంశాల గురించి ఏకి పారేశాడు పార్ల‌మెంట్ సాక్షిగా. ఆయ‌న సంధించిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తున్నాయి. త‌ను వేసిన ప్ర‌శ్న‌ల‌కు