జైపూర్ : జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన తురుపు ముక్క, చిచ్చర పిడుగు , 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేశాడు. కేవలం 37 బంతులు ఎదుర్కొని 103 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. మైదానంలోకి వచ్చీ రావడంతోనే రెచ్చి పోయాడు సూర్యవంశీ. బౌలర్ల భరతం పట్టాడు. స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు.
తనతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన మరో క్రికెటర్ ధ్రువ్ జురైల్ సైతం రెచ్చి పోయాడు. తను కూడా తీసి పోని విధంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తను 51 పరుగులు చేశాడు. ఫెరీరా 33 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 228 రన్స్ చేసింది. మరోసారి రాయల్స్ స్కిప్పర్ రియాన్ పరాగ్ నిరాశ పరిచాడు. తను కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అనంరతం మైదానంలోకి దిగిన సన్ రైజర్స్ దంచి కొట్టింది. తొలుత ట్రావిస్ హెడ్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టినా ఆ తర్వాత అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు తొలి వికెట్ కు 132 రన్స్ చేశారు. జట్టును విజయ పథంలోకి నడిపించారు.
The post చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
Categories: