hyderabadupdates.com Gallery బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌

బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌

బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌ post thumbnail image

తాడేపల్లి/అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కో ఆర్డినేటర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీ అభ్యున్నతికి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారన్నారు. రాజ్యాధికారంలో, చట్టాల రూపకల్పనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. ఎందరో బీసీ రాజకీయ ఉద్దండులను టీడీపీ తీర్చిదిద్దిందన్నారు. అన్న స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నార‌ని చెప్పారు స‌విత‌.
సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలన్నారు. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కల్పించడానికే బీసీ సాధికార సమితులను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశం ద్వారా ఆదరణ 3.0 పథకం అమలుపై సాధికార సమిత కన్వీనర్ల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గత రాక్షస ప్రభుత్వంపై బీసీ సాధికార సమితులు అలుపెరగని పోరాటం చేశారని మంత్రి సవిత కొనియాడారు. ప్రాణాలు పోతున్నా భుజాన పెట్టుకున్న పసుపు జెండాను దించ లేదన్నారు. బీసీ నేత తోట చంద్రయ్య, కాకినాడ జిల్లాలో లాలం బంగారయ్య తమ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదల్లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైసీపీ రాక్షస మూకలను చూసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత తెగువను మరిచి పోలేమన్నారు.
The post బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటుతెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం అధికారికంగా పార్టీని పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పేరు కూడా ఖ‌రారు చేశారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Jyoti Singh: బిహార్ ఎన్నికల బరిలో స్టార్ హీరో భార్యJyoti Singh: బిహార్ ఎన్నికల బరిలో స్టార్ హీరో భార్య

Jyoti Singh : భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్‌… ఆయన భార్య జ్యోతీ సింగ్‌ ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన భర్త స్త్రీ లోలుడంటూ జ్యోతీ సంచలన కామెంట్లు చేశారు. గృహ హింస

Gujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామాGujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామా

Gujarat Cabinet : గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మరికాసేపట్లో