hyderabadupdates.com Gallery అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం

అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం

అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం post thumbnail image

ముంబై : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముంబై వేదిక‌గా ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు సీఎం. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత నేను ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశానని చెప్పారు. సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ను అమలు చేశాం అని వెల్ల‌డించారు. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవేన‌ని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశార‌ని కొనియాడారు.
అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్షఅని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అంది పుచ్చుకున్నాం అన్నారు. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయన్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు సీఎం. గతంలో విద్యుత్ సంస్కరణల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం అన్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణా కమిషన్ ను కూడా తీసుకు వచ్చామ‌ని తెలిపారు. సౌర, పునరుద్పాదక విద్యుత్ కు కూడా పెద్ద ఎత్తున భారత్ లో ప్రోత్సాహం కల్పించ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం.
The post అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలిఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించ వద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కూట‌మి స‌ర్కార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2.5 లక్షల ఆరోగ్య భీమా పచ్చి మోసం అన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకం అంటూ

Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి !Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి !

  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య గారి వీధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి, తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం… గునుపూడి