hyderabadupdates.com Gallery మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు

మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు

మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు post thumbnail image

న్యూఢిల్లీ : భారత దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆయ‌న విపక్షాల‌పై విరుచుకుప‌డ్డారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును అడ్డుకోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మాక‌కు 66 శాతం ఓట్లు రాక పోవ‌చ్చు. కానీ 100 శాతం మ‌హిళ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కు ఉందని ప్ర‌క‌టించారు. ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు. వాళ్లు పండుగ చేసుకుంటున్నార‌ని, దేనికోసమో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త మీపై లేదా అని ప్ర‌శ్నించారు మోదీ. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీలతో సహా ప్రతిపక్షాల స్వార్థ రాజకీయాలు మహిళల హక్కులను హరించి వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాయ‌ని ఆరోపించారు.
మహిళా కోటా చట్టాన్ని, మరో రెండు బిల్లులను సవరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. దేశంలోని మహిళల హక్కులను కాలరాస్తూ కేవలం తమ స్వప్రయోజనాల కోసం పనిచేసే అవకాశవాదుల గుంపుగా న‌రేంద్ర మోదీ ప్రతిపక్షాన్ని అభివర్ణించారు. లోక్‌సభలో మహిళా కోటా సవరణ చట్టాన్ని, మరో రెండు బిల్లులను ఆమోదింప జేయడంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) విఫలమైన ఒక రోజు తర్వాత ఈ రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాము దేశం కోసం ప‌ని చేస్తామ‌ని, కానీ విప‌క్షాలు జాతిని నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు.
The post మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్

విజ‌య‌వాడ‌ : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌ను రీ స‌ర్వే చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతే కాకుండా స‌ర్వే చేసిన భూముల వివ‌రాల‌ను ఆన్ లైన్

సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలిసమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి

హైద‌రాబాద్ : సామాజిక బాధ్య‌త‌తో కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. స‌మాజం కోసం చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల

పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగంపోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం

హైద‌రాబాద్ : లా అండ్ ఆర్డ‌ర్ ను కాపాడ‌డంలో పోలీసులు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ని అన్నారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. ఆయ‌న అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించారు. సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు