hyderabadupdates.com Gallery శ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

శ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

శ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు post thumbnail image

తిరుమల : తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విష‌యాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్ల‌డించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అడిష‌న‌ల్ ఈవో చౌద‌రి మాట్లాడారు. ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.
సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయని అన్నారు. మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారిత్రక నేపథ్యం, శాసనాలు, అన్నమాచార్య గ్యాలరీ, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజ వంశీయులకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.
మ్యూజియాన్ని దీర్ఘకాలిక సుస్థిరతతో ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించామని అన్నారు ఏఈవో. భక్తులకు మెరుగైన అనుభవం కల్పించేలా ప్రవేశ, నిష్క్రమణ సదుపాయాలు, క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక అనుభూతి కలిగించేలా ఈ మ్యూజియాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఎఫ్ఏసీ) శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు, టీసీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
The post శ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేనుసంజూ శాంస‌న్ స‌హ‌కారం మ‌రిచి పోలేను

ముంబై : భార‌త క్రికెట్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మంగ‌ళ‌వారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. అంద‌రూ త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని

త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం నిజమైన సంస్కారంత‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం నిజమైన సంస్కారం

తిరుపతి : నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలిఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తిరిగి పునరుద్ద‌రించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర కొన‌సాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది.