చెన్నై : స్వంత గడ్డపై దారుణంగా ఓటమి పాలైంది మరోసారి చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టుకు స్వంత స్థలం అచ్చి రానట్టుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే గెలుపొందింది సీఎస్కే. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో నిన్నటి వరకు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రావడం. ఒకానొక దశలో 100 పరుగులైనా చెన్నై జట్టు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రుతురాజ్, శివమ్ దూబే నిలడడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. లేకపోతే సీఎస్కే పరువు పోయి ఉండేది. ఐపీఎల్ లో సీఎక్కు జట్టుకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ టీంకు లేదు. ఆ మాత్రం గుర్తించకుండా ప్లేయర్లు ఆడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కోట్లు పెట్టి తీసుకున్న సంజు శాంసన్ అడపా దడపా ఆడడం తప్పితే ఆశించిన రీతిలో రాణించడక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అవసరమైన సమయంలో ఆడకుండా సెంచరీ చేస్తే ఏం లాభం అని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సీఎస్కేకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే మూడు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోండగా మిగతా జట్లు ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. చివరి నాలుగు స్థానంలో ఉండాలంటే ఇకనైనా అన్ని మ్యాచ్ లు సీఎక్కే గెలవాల్సిన పరిస్తితి నెలకొంది. గుజరాత్ స్కిప్పర్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సత్ఫలితం ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 74 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. అనంతరం గుజరాత్ 16.4 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. సాయి సుదర్శన్ 46 బంతుల్లో 87 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 7 భారీ సిక్సులు ఉన్నాయి.
The post చేతులెత్తేసిన చెన్నై చెలరేగిన టైటాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
చేతులెత్తేసిన చెన్నై చెలరేగిన టైటాన్స్
Categories: