hyderabadupdates.com Gallery గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ప‌వ‌న్ ఆరా

గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ప‌వ‌న్ ఆరా

గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ప‌వ‌న్ ఆరా post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో చేప‌ట్టిన గ్రీన్ క‌వ‌ర్ ప్రాజెక్టుల పురోగ‌తిపై ఆరా తీశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ . అమ‌రావ‌తి లోని వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని 2వ బ్లాకులో కీలక స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా అట‌వీ శాఖ ఉన్న‌తాధికారుల‌తో కీల‌క‌ సూచ‌న‌లు చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చ‌ర్చించారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతి ప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. అట‌వీ శాఖ ప‌రిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల‌ని ఆదేశించారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎక్క‌డిక‌క్క‌డ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇదే స‌మ‌యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ సైట్ లో గ్యాస్ లీక్ వల్ల తలెత్తిన బ్లో అవుట్ ప్రభావం గురించి కూడా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్లో అవుట్ చోటు చేసుకున్న ప్రాంతానికి కిలో మీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించామని తెలుపుతూ ఇరుసుమండ ప్రాంతంలో చేపడుతున్న చర్యలను క‌లెక్ట‌ర్ డిప్యూటీ సీఎంకు వివ‌రించారు.
The post గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ప‌వ‌న్ ఆరా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయంకలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం

హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌతిండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా

AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటనAP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన

    విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని… ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం

పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాలిపేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాలి

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పేద‌ల‌కు మెరుగైన రీతిలో వైద్య సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. గుండె సంబంధిత వ్యాధుల నివారించాలన్న లక్ష్యంతో అందరం కలిసి ఒక మిషన్‌గా పని చేద్దామని పిలుపునిచ్చారు.