hyderabadupdates.com Gallery చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ post thumbnail image

అమరావతి : నేతన్నలకు రాష్ట్ర స‌ర్కార్ తీపి కబురు చెప్పంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్ర‌క‌టించారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్గ్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు.
ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని వెల్ల‌డించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనంతో కూడిన ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని మంత్రి స్ప‌ష్టం చేశారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.
The post చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్‌ మాల్యVijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య

    తనకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా… ఎక్కువ మొత్తంలో వసూలు చేశాయని విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్య అభ్యంతరం తెలిపారు. తన నుంచి వసూలు చేసిన అసలు, వడ్డీలకు మరోసారి కొత్తగా వడ్డీ విధిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక

DK Shivakumar: ఎంపీ తేజస్వీ సూర్యపై డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్DK Shivakumar: ఎంపీ తేజస్వీ సూర్యపై డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్

DK Shivakumar : ఎంపీ తేజస్వీ సూర్య ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్‌ మెటీరియల్‌ అంటూ డీసీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) మండిపడ్డారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ… నగరంలో సొరంగ మార్గం నిర్మించరాదనేందుకు తేజస్వీ

ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తంఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం

ఇరాన్ : ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. నిన్న‌టి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంట‌రి పోరాటం చేస్తూ వ‌చ్చిన ఆ దేశ అధ్య‌క్షుడు ఖ‌మేనీ ఇజ్రాయెల్, అమెరికా జ‌రిపిన దాడుల్లో ఖ‌తం అయ్యాడు. ఈ విష‌యాన్ని అటు ట్రంప్