hyderabadupdates.com movies ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఇప్పుడు స‌డెన్‌గా పెళ్లి చేసుకుని అంద‌రికీ షాకిచ్చింది మోనాలిసా. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా.. ఫ‌ర్మాన్ ఖాన్ అనే కేర‌ళ ముస్లిం యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింద‌ట‌.

ఫేస్ బుక్ ద్వారా వీళ్లిద్ద‌రికీ జ‌రిగిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఏడాదిగా వీరి ప్రేమాయ‌ణం సాగుతుండ‌గా.. మోనాలిసా ఇంట్లో విష‌యం తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేద‌ట‌. అంతేకాక మోనాలిసాను మ‌రో వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

దీంతో మోనాలిసా తాను షూటింగ్‌లో పాల్గొంటున్న చోటి నుంచి ఫ‌ర్మాన్ కోసం కేర‌ళ‌కు వ‌చ్చేసింది. ఇద్ద‌రూ క‌లిసి తిరువనంతపురంలోని పోలీసు స్టేషన్‌లోకు వెళ్లారు. త‌న త‌ల్లిదండ్రులు త‌మ ప్రేమ‌ను అంగీకరించ‌డం లేద‌ని.. వారి నుంచి త‌మ‌కు ర‌క్ష‌ణ కావాల‌ని ఫ‌ర్మాన్‌తో క‌లిసి ఆమె పోలీసుల‌ను కోరింది.

ఆ త‌ర్వాత ఆమె ఫ‌ర్మాన్‌ను పెళ్లి కూడా చేసుకుంది. హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకున్న అనంత‌రం ఆమె కెమెరాల ముందుకు వ‌చ్చింది. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.

పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఒక బాలీవుడ్ సినిమాలో అవ‌కాశం కూడా అందుకుంది. ఆమెకు మ‌రి కొన్ని అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

కొన్ని నెల‌ల్లోనే పూర్తిగా అవ‌తారం మార్చేసిన‌ మోనాలిసా.. మోడ‌లింగ్‌లోకి కూడా అడుగు పెట్టింది. అనేక కార్య‌క్రమాల్లో కూడా పాల్గొంది. కానీ త‌ర్వాత మోనాలిసా పెద్ద‌గా మీడియాలో, సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌లేదు. కానీ ఇప్పుడు హ‌ఠాత్తుగా మోనాలిసా మ‌ళ్లీ వార్త‌ల్లో వ్య‌క్తిగా మారింది.మోనాలిసాకు 18 ఏళ్లు నిండి మేజ‌ర్ అయిన నేప‌థ్యంలో పెళ్లి చేసుకోవ‌డానికి ఏ ఇబ్బందీ లేక‌పోయింది. పోలీసులు ఇచ్చిన భ‌రోసాతో మోనాలిసా, ఫ‌ర్మాన్ వివాహంతో ఒక్క‌ట‌య్యారు.

Related Post

ఊహించని షాక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ఊహించని షాక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్

ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నెరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రానికి ఉపయోగపడటం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ముందు నాని అన్నారు. తర్వాత నితిన్ ఫిక్స్ అయ్యాడు. తమ్ముడు ఫలితం ప్రభావమో లేక తెర వెనుక ఇంకేదైనా

రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా చిన్న స్థాయిలో పని చేసిన వాళ్లు.. తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంటారు. కానీ ఈ లోపు వారికి అనేక అవమానాలు

Mega Blockbuster Hits 300 Crore: Chiranjeevi’s ‘Mana Shankara Vara Prasad Garu’ Creates HistoryMega Blockbuster Hits 300 Crore: Chiranjeevi’s ‘Mana Shankara Vara Prasad Garu’ Creates History

Megastar Chiranjeevi has once again proved his box office supremacy with Mana Shankara Vara Prasad Garu, which is rewriting records across the Telugu film industry. The Sankranthi entertainer, directed by