hyderabadupdates.com Gallery సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు న‌మోదు

సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు న‌మోదు

సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు న‌మోదు post thumbnail image

హైద‌రాబాద్ : న‌టి అశు రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది . పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించి కోట్ల రూపాయల మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు కేజీల బంగారాన్ని కొనేలా చేసింద‌ని బాధిత ఫ్యామిలీ వాపోయింది. ఉండేందుకు ఫ్లాట్ కావాలని చెప్పి మూడు కోట్ల ఖరీదైన విల్లాకు సైతం ధర్మేంద్ర నుండి అడ్వాన్స్ తీసుకుంది. వేణుస్వామి తో జాతకాలు సైతం చూపించుకున్నాయి ఇరు కుటుంబాలు. పెళ్లి అవుతుంది అనే నమ్మకంతో ఆశు రెడ్డి ఎంత అడిగితే అంత ఇచ్చుకుంటూ వెళ్లాడు టెక్కీ ధ‌ర్మేంద్ర‌. ఉన్న‌ట్టుండి తాను పెళ్లి చేసుకోవ‌డం లేదంటూ చెప్పేసింది ఆషు రెడ్డి. అయితే త‌న‌ను పెళ్లి చేసుకో లేదా తన డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు ధ‌ర్మేంద్ర‌.
స్పందించ‌క పోవ‌డం, ఏదీ చేయక పోవడం తో పోలీస్ లను ఆశ్రయించారు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి. ఆశు రెడ్డి, ఆమె కుటుంబసభ్యుల పై కేస్ నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు.రెండు సార్లు ధర్మేంద్ర ను మోసం చేసిన‌ట్లు వాపోయారు. ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్నాక డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని, తిరిగి పెళ్లి చేసుకుంటానంటూ మ‌రోసారి మోసానికి పాల్ప‌డింది ఆశు రెడ్డి. లండన్ లో ఉంటున్న ధర్మేంద్ర నుండి 9.83 కోట్లు గోల్డ్, డబ్బు, ఫ్లాట్ రాయించుకుంది. ఆశు రెడ్డి సోదరి దివ్యా రెడ్డి కు సైతం 50 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు ధ‌ర్మేంద్ర‌. వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని హనీ ట్రాప్ చేసి ఇలా మోసం చేస్తున్నారని ధర్మేంద్ర తండ్రి పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా రిటర్న్ లో కేస్ పెడతానని బెదిరింపులకు పాల్పడింది ఆశు రెడ్డి. దీంతో ఆశు రెడ్డి ఫ్యామిలి పై BNS 318(4)r/w3(5) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు.
The post సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు న‌మోదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

హైద‌రాబాద్ : ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేక కొత్త దుకాణం మొద‌లు పెట్టారంటూ కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్

తిరుపతి : ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖకేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ