hyderabadupdates.com Gallery వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం post thumbnail image

తిరుపతి : శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి చూపిన మహా కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. ఆమె 296వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ మురళి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – ద్విపద భాగవతం” అనే అంశంపై ప్రసంగించారు. బమ్మెర పోతన శైలిని అనుసరిస్తూనే స్వతంత్ర భావాలతో వెంగమాంబ శ్రీభాగవతాన్ని ద్విపద కావ్యరూపంలో రచించారని తెలిపారు. ఇందులో శ్రీకృష్ణుడి దివ్యరూపాన్ని అత్యంత సుందరంగా చిత్రించారని వివరించారు. అలాగే శతకాలు, యక్షగానాలు, “శ్రీ వేంకటాచల మహత్యం” వంటి గ్రంథాల ద్వారా భక్తి సాహిత్యానికి విశిష్టమైన సేవలందించారని కొనియాడారు.
నగరి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. వరలక్ష్మీ “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహత్యం” అంశంపై మాట్లాడుతూ, సంస్కృతంలో విస్తృతంగా ఉన్న పురాణ విషయాలను వెంగమాంబ సులభమైన భాషలో ఆరు ఆశ్వాసాలలో సమగ్రంగా అందించారని అన్నారు. ముఖ్యంగా శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని భక్తులకు సులభంగా అర్థమయ్యేలా అందించారని పేర్కొన్నారు.
టీటీడీ ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డా. నరసింహాచార్యులు “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – సాహిత్య సంవీక్షణం” అంశంపై మాట్లాడుతూ, తెలుగు భక్తి సాహిత్యంలో వెంగమాంబకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఆమె రచనల్లో శ్రీవేంకటేశ్వర స్వామిపై అచంచల భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి, తాత్విక దృక్పథం సమన్వయంగా ప్రతిఫలిస్తాయని వివరించారు. “ద్విపద భాగవతం”లో శ్రీకృష్ణ లీలలను ప్రత్యేకంగా ఆవిష్కరించారని, “శ్రీ వేంకటాచల మహత్యం” వంటి కృతుల ద్వారా తిరుమల క్షేత్ర మహిమను విశ్వవ్యాప్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు.
The post వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్

CBI : పంజాబ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌చరణ్ సింగ్ బుల్లర్ అవినీతి కేసులో గురువారం అరెస్ట్ అయ్యారు. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు ఆయన్ని మొహాలి ఆఫీస్‌లో అదుపులోకి తీసుకున్నారు.

బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యంబౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

ల‌క్నో : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్థి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టును ఓడించింది. రెండు ఓట‌ముల త‌ర్వాత ద‌క్కిన విజ‌యం ఇది. ఆతిథ్య జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ

Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

    భారత్‌ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే… వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్‌ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.