hyderabadupdates.com movies ఆమిర్ ఖాన్ ‘వాష్ రూమ్’ వీడియో వైరల్

ఆమిర్ ఖాన్ ‘వాష్ రూమ్’ వీడియో వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్టేజ్ ఎక్కినా.. మైక్ అందుకున్నా ఎంత సరదాగా ప్రవర్తిస్తారో.. మాట్లాడతారో తెలిసిందే. తాజాగా ఆయన ఒక స్టేజ్ మీద తనదైన శైలిలో చిలిపితనం ప్రదర్శించారు. మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు మూత్రం వస్తోంది అని చెప్పి స్టేజ్ దిగి వాష్ రూంకి పరుగులు పెట్టారు.

ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ దిన్ మూవీకి సంబంధించిన ఈవెంట్లో ఈ సరదా సంఘటన జరిగింది. స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఉన్నట్లుండి ఆమిర్ రెండు నిమిషాలు అనుమతి ఇస్తారా అని నిర్వాహకులను అడిగాడు. తర్వాత తనకు పాస్ వస్తోంది అని సంజ్ఞ చేసిన ఆయన వాష్ రూంకి వెళ్ళొస్తా అని చెప్పి స్టేజ్ దిగి పరుగులు పెట్టారు. దీంతో ఆడిటోరియం నవ్వుల్లో మునిగిపోయింది.

ఐతే ఈ ఘటనతో అందరినీ నవ్వించిన ఆమిర్ అంతకుముందు.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తన కుమారుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి జంటగా నటించిన ఏక్ దిన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి ఆమిర్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ముంబైలోని ఎస్ఎన్డీటీ కాలేజీలో నిర్వహించిన ‘ఏక్ దిన్ కి మెహఫిల్’ అనే మ్యూజికల్ ఈవెంట్‌లో తెరపై తన కొడుకును చూస్తూ అమీర్ ఖాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఆమిర్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా.. పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదారుస్తూ కనిపించింది. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన ఆమిర్ తన కొడుకు గురించి ఎక్కువ మాట్లాడలేదు. సాయిపల్లవిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం మన దేశంలోనే అత్యుత్తమ నటి సాయిపల్లవి అని అన్నారు.ఆమె ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కొనియాడారు. ఏక్ దిన్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు జునైద్ తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే ఆధారంగా తెరకెక్కిన లవ్ యాపా చిత్రంలో నటించగా అది మంచి ఫలితాన్ని అందుకోలేక పోయింది.

View this post on Instagram

Related Post

Bhatti Vikramarka Unveils Title Poster of ‘Pithapuram lo’.Bhatti Vikramarka Unveils Title Poster of ‘Pithapuram lo’.

Telangana Deputy Chief Minister Bhatti Vikramarka officially launched the title poster of the upcoming Telugu film ‘Pithapuram lo’, directed by Mahesh Chandra — best known for his hit ‘Preyasi Rave’.

Kaantha OTT Release: When and where to watch Dulquer Salmaan’s 1950s drama onlineKaantha OTT Release: When and where to watch Dulquer Salmaan’s 1950s drama online

Despite strong visuals and early praise for its performances, Kaantha struggled to attract large crowds. Many viewers missed its short theatrical window, making its digital release even more anticipated. With