hyderabadupdates.com Gallery క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు

క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు

క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర సీమ‌లో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే పార్టీ చీఫ్ త‌ళ‌ప‌తి విజ‌య్ కి బిగ్ షాక్ త‌గిలింది. తాను చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తితో క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనికి ప్ర‌ధాన కార‌కుడు విజ‌య్ అంటూ డీఎంకే స‌ర్కార్ పేర్కొంది. ఆయ‌న చెప్పిన స‌మ‌యానికి రాక పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అధికారికంగా న‌టుడు, టీవీకే చీఫ్ విజ‌య్ కి స‌మ‌న్లు జారీ చేసింది.
ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప‌లుమార్లు విచార‌ణ చేప‌ట్టింది. ద‌ర్యాప్తులో భాగంగా టీవీకే పార్టీ ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన ప‌త్రాల‌ను, సీసీ టీవీ ఫుటేజ్ ల‌ను కూడా తీసుకు వెళ్లింది. ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌ను బాధ్యుడిని చేస్తూ కేసు న‌మోదు చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ టీవీకే విజ‌య్ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ప‌లువురు ప్రాణాలు కోల్పోయార‌ని, వారికి తాను ముందే ప్ర‌క‌టించిన విధంగా ఆర్థిక సాయం కూడా చేశాన‌ని తెలిపాడు కోర్టుకు. కాగా ఈ ఘ‌ట‌న గ‌త ఏడాది 2025సెప్టెంబర్ 27న కరూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌గా దీనిని పేర్కొంది బీజేపీ.
The post క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

    మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ

CM Revanth Reddy: ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌ – సీఎం రేవంత్CM Revanth Reddy: ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌ – సీఎం రేవంత్

    అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్యస్థాన‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌,