hyderabadupdates.com Gallery గురువు రుణం తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి

గురువు రుణం తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి

గురువు  రుణం తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశీప‌తి శ్రీ‌నివాస్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎలా చెబితే అలా ఆడుతున్నాడ‌ని, పాల‌నా ప‌రంగా పూర్తిగా త‌ను కంట్రోల్ త‌ప్పాడ‌ని ఆరోపించారు. ఇవాళ దేశిప‌తి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్న కార్తీక దీపం డైలీ సీరియల్ నడుస్తూనే ఉంటుంద‌న్నారు. త‌ను కావాల‌నే మాజీ మంత్రి హ‌రీశ్ రావును ల‌క్ష్యంగా చేసుకున్నాడ‌ని మండిప‌డ్డారు. సీఎం ప‌దే ప‌దే తాను న‌ల్ల‌మ‌ల పులి బిడ్డ‌న‌ని చెప్పుకుంటున్నాడ‌ని కానీ ఆయ‌న క‌నీసం పిల్లి కూడా కాదంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని డైవర్షన్, డెమోలిసిషన్‌కు సీఈవోగా పెట్టాలంటూ పేర్కొన్నారు ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్.
రేవంత్ రెడ్డి వలస వాదుల బానిస అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతే కాదు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికి చాలా కష్టపడుతున్నాడని ఫైర్ అయ్యారు .తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ..బనకచర్లకు ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ తాను స‌మైక్య‌వాదిన‌ని నిరూపించుకున్నాడ‌ని నిప్పులు చెరిగారు. త‌ను మ‌రో జ‌న్మ ఎత్తినా స‌రే బీఆర్ఎస్ ను ఎదుర్కోవ‌డం త‌న త‌రం కాద‌న్నారు. ఇక‌నైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు దేశిప‌తి శ్రీ‌నివాస్.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని చూస్తున్నాడ‌ని, అందులో భాగంగానే అన్నింటిని మార్చే ప‌నిలో ప‌డ్డాడ‌ని, కానీ చైత‌న్య‌వంత‌మైన స‌మాజం చూస్తూ ఊరుకోద‌ని, త‌న‌ను ఉరికించి త‌రిమేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.
The post గురువు రుణం తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !

Family Suicide : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Family Suicide). ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్‌ తన

CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహంCJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ