hyderabadupdates.com Gallery చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు post thumbnail image

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభా గౌరవం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు . యువతకు , విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో లోకేష్ ‘మాక్ అసెంబ్లీ’ అనే కార్యక్రమాన్ని రూపొందించార‌ని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గుర్తుచేశారు.

నిన్న గవర్నర ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. సభ్యులు నినాదాలు చేస్తూ, కాగితాలు చింపి వేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరం అని స్పీకర్ అన్నారు. వేలాది మంది పోటీ పడితే కేవలం 175 మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటం అని గుర్తించాల‌న్నారు. ఆ గౌరవాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా విద్యాసంస్థల నుండి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలిపారు. మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు? చట్ట సభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్ళీ మార్చలేమ‌ని ఆందోళ‌ణ వ్య‌క్తం చేశారు.
The post చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్

విజ‌య‌వాడ‌ : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌ను రీ స‌ర్వే చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతే కాకుండా స‌ర్వే చేసిన భూముల వివ‌రాల‌ను ఆన్ లైన్

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోంతిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

​కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్‌షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త