hyderabadupdates.com Gallery డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి

డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి

డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో మరింతగా ఉత్తరాది బలం పెరిగితే, కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రభావం పడుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అమరావతి రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ మండిప‌డ్డారు. ప్రతిపాదిత డీలిమిటేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు మ‌రింత ముప్పు వాటిల్లే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు.
మెరుపు వేగంతో, నియంతృత్వ పోకడతో రాజ్యాంగ బద్ధంగా సంప్రదింపులు అనేవి లేకుండా, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ, జనాభా ప్రాతిపదికన మాత్రమే అమలు చేయబడితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ బలం, ఆర్థిక అవకాశాలు అత్యంత దారుణంగా అతి తీవ్రంగా దెబ్బతింటాయని స్పష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇది కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు; ఇది మన రాష్ట్ర ఆర్థిక స్థితి గతి, భవిత, అభివృద్ధి, సంక్షేమ ఆకాంక్షలు, వీటన్నిటినీ అంధకారంలోకి నెట్టివేసే సందర్భం పేర్కొన్నారు.
లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం తగ్గి పోవడం వల్ల కేంద్ర స్థాయిలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యంతో వచ్చే సదవకాశాలు పూర్తిగా నష్టపోయి, మన రాజకీయ శక్తి తీవ్రంగా బలహీన పడుతుందన్నారు ష‌ర్మిలా రెడ్డి. కేంద్ర నిధుల కేటాయింపులు, జాతీయ ప్రాజెక్టుల ప్రాధాన్యత, విధాన నిర్ణయాల్లో రాజకీయ బలం, దేశానికి సంబంధించిన కీలక అంశాల్లో మన గళం, ఇలా కీలక పాత్రలు పోషించే విషయాల్లో, వ్యవస్థల్లో బలహీన పడిపోతుందన్నారు. స్పష్టంగా ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంద‌న్నారు.
The post డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలుDelhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10వ తేదీన కారు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉమర్ ఉన్ నబీ అనే డాక్టర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన

శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైందిశాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది

ముంబై : సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ జ‌ట్టును 7 ప‌రుగుల తేడాతో ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది భారత జ‌ట్టు. ముందుగా మైదానంలోకి దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 253 ర‌న్స్ చేసింది. ఇందులో సంజు శాంస‌న్

‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కీల‌క‌మైన న‌టుడిగా ఉన్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్ర‌స్తుతం