hyderabadupdates.com Gallery బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ

బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ

బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ post thumbnail image

అమరావతి : రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను అందించడంపై శాసన మండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను సరఫరా చేయడం జరుగుతోందన్నారు. గతంలో ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్ కిన్ లు ఇచ్చేవారని తెలిపారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్ ను ప్రభుత్వం అందజేస్తోంద‌ని చెప్పారు నారా లోకేష్‌.
గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగిందన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోంద‌ని తెలిపారు. 96 శాతం బాలిలకు తమకు శానిటరీ న్యాప్ కిన్ లు అందుతున్నాయని, 4 శాతం మంది అందడం లేదని చెప్పార‌న్నారు. నాణ్యత విషయంలో 1 శాతం బాగా లేదని, 14 శాతం పర్వాలేదు, బాగుందని 85 శాతం మంది చెప్పారన్నారు. శానిటరీ న్యాప్ కిన్స్ ఎబ్సార్ ప్షన్ పై 84 శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, బాగాలేదని 2 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారని తెలిపారు. సైజ్ విషయంలో 89 శాతం మంది బాగుందని, 11 శాతం బాగాలేదని చెప్పారు.
ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపైనా చర్చించడం జరిగిందన్నారు. దీనిపైనా పరిశీలన చేస్తామ‌న్నారు. ఎన్జీవోలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు నారా లోకేష్‌. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డ్ ను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టామ‌న్నారు. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. హెచ్ పీవీ వ్యాక్సిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఇదో క్యాంపెయిల్ లా చేస్తామ‌ని, దీనిపై అనేక అపోహలు ఉన్నాయని, అందరం కలిసికట్టుగా దీనిపై అవగాహన తీసుకు రావాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
The post బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలిజీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాంసంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కీల‌క‌మైన విండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరింది. ఈసంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్

తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎంతెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భ వేదిక‌గా ఆయ‌న ప్ర‌సంగించారు. సాగు నీటి రంగంపై ప్ర‌సంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం