hyderabadupdates.com Gallery మే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

మే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

మే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు post thumbnail image

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌ట‌న చేసింది. మే నెల‌లో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంతో పాటు అనుబంధ ఆల‌యాల‌లో కూడా విశేష ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ⁠మే 1, 15, 22, 29వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగుతుంది. 1న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం ఊరేగింపు ఉంటుంది.
2వ తేదీన‌ అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు ముగుస్తాయి. మే 8న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో మే 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు . శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో మే 18వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామి వారికి రాత్రి 7 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.శ్రీసూర్య నారాయణ స్వామి ఆలయంలో మే 27న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో మే 2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం నిర్వ‌హిస్తారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 1, 8, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం జ‌రుగుతుంది. మే 5న ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాద పద్మారాధన సేవ. 9న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం. మే 13న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.మే 3, 10, 17, 24, 31వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం జ‌రుగుతుంది.
The post మే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Karnataka: కర్ణాటక సీఎం రేసులో జి. ప‌ర‌మేశ్వ‌ర ?Karnataka: కర్ణాటక సీఎం రేసులో జి. ప‌ర‌మేశ్వ‌ర ?

Karnataka : క‌న్న‌డ‌నాట సీఎం సీటు కోసం సిగ‌ప‌ట్లు కొన‌సాగుతున్నాయి. సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మ‌ధ్య కుర్చీలాట‌కు ఇప్పుడ‌ప్పుడే ముగింపు ఉండేట్టు క‌న‌బ‌డ‌డం లేదు. అంతా హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే కంటితుడుపు

Minister Rajnath Singh: పాకిస్తాన్ కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌Minister Rajnath Singh: పాకిస్తాన్ కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌

    భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ట్రైలర్‌ మాత్రమేనన్న ఆయన… పాక్‌ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్‌ క్షిపణి పరిధిలో ఉందని… స్పష్టం

సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదుసినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్