hyderabadupdates.com Gallery రాయ‌ల్స్ రాజ‌సానికి స‌న్ రైజ‌ర్స్ చెక్ పెట్టేనా..?

రాయ‌ల్స్ రాజ‌సానికి స‌న్ రైజ‌ర్స్ చెక్ పెట్టేనా..?

రాయ‌ల్స్ రాజ‌సానికి స‌న్ రైజ‌ర్స్ చెక్ పెట్టేనా..? post thumbnail image

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతోంది రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ . ఈ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచ్ లు ఆడ‌గా అన్నింట్లోనూ విజ‌యం సాధించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు వ‌ణుకు పుట్టిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది. ఇక టోర్నీ విష‌యానికి వ‌స్తే సోమ‌వారం కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియం. ఈ మ్యాచ్ లో కూడా విక్ట‌రీ న‌మోదు చేసి ఎదురే లేద‌ని చాటాల‌ని చూస్తోంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్.
ఇక టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒకే ఒక్క మ్యాచ్ లో విజ‌యం సాధించింది. ఈ ఒక్క గెలుపు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై వ‌చ్చింది. ఇక ఆర్సీబీ, పంజాబ్ , ల‌క్నో చేతుల్లో వ‌రుస‌గా ఓట‌మి పాలైంది స‌న్ రైజ‌ర్స్. ఇప్పుడు ఎలాగైనా స‌రే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించాల‌ని, టోర్నీలో నిల‌వాల‌ని అనుకుంటోంది హైద‌రాబాద్. ఇక టోర్నీలో రాజ‌స్థాన్ సీఎస్కే, గుజ‌రాత్ టైటాన్స్, ముంబై ఇండియ‌న్స్, ఆర్సీబీ జ‌ట్ల‌ను వ‌రుస‌గా ఓడించింది. విస్తు పోయేలా చేసింది. ఇక హైద‌రాబాద్ మైదానం బ్యాటింగ్ పిచ్ కావ‌డంతో భారీ స్కోర్లు న‌మోద‌య్యే ఛాన్స్ ఉంది. ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే ఆట‌గాళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లో ఇషాన్ కిషన్ కెప్టెన్ కాగా హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమ్మిన్స్, లిత్విష్ , అభిషేక్ శ‌ర్మ‌, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, క‌మిందు మెండీస్ , రాహుల్ చాహ‌ర్ , జ‌య‌దేవ్ ఉనాద్క‌త్, అనికేత్ వ‌ర్మ‌, హ‌ర్ష్ దూబే, బ్రైడ‌న్ కార్సే, ఎషాన్ మ‌లింగ‌, జీష‌న్ అన్సారీ, స‌లీల్ అరోరా, శివంగ్ కుమార్, శివమ్ మావి, డేవిడ్ పేన్, సకీబ్ హుస్సేన్, ఓంకార్ రాజచంద్రన్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ రవీన్ ఉన్నారు.
ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే రియాన్ పరాగ్ కెప్ట‌న్ కాగా , యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, షిమ్రోన్ హెట్మెయర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, నాండ్రే బర్గర్, క్వేనా మఫాకా, వైభవ్ సూర్యవంశీ, శుభమ్ ల్యాఫ్ దూబే, ప్రీరాల్ దూబే. రావ్, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సుశాంత్ మిశ్రా, యుధ్వీర్ సింగ్ చరక్, బ్రిజేష్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్, యశ్ రాజ్ పుంజా, దాసున్ షనక ఆడ‌తారు.
The post రాయ‌ల్స్ రాజ‌సానికి స‌న్ రైజ‌ర్స్ చెక్ పెట్టేనా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

    ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్‌ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్

Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000

  సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్‌ రమేశ్‌ రాజు, జతీందర్‌పాల్‌ సింగ్‌ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో

ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలుఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని