hyderabadupdates.com Gallery స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు

స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు

స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు post thumbnail image

అమరావతి : వ్య‌వ‌సాయం దండుగ కాద‌ని అది పండుగ అని అందుకే త‌మ స‌ర్కార్ ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని చెప్పారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని గ‌వ‌ర్న‌ర్ పేట లో స‌మ‌గ్ర‌ జ‌ల‌వ‌న‌రుల నిర్వ‌హణ , రైతు శిక్ష‌ణ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర‌ ఉద్యానశాఖ ఆధ్వ‌ర్యంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. నీటి వనరుల తగ్గుదల, వాతావరణ మార్పులు, సాగు వ్యయాల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య రైతును కాపాడాలంటే వ్యవసాయాన్ని స్మార్ట్ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు.
దేశానికి మార్గదర్శకమైన మైక్రో ఇరిగేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, పర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఇకపై నీరు, ఎరువుల వినియోగం ఊహలపై కాకుండా సెన్సర్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20–30 శాతం నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి,నాణ్యత పెరుగుదల సాధ్యమవుతాయని అన్నారు. ఉద్యాన, తోట, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ మరియు అధిక విలువైన పంటలకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమని వివరించారు. పీఎంకేఎస్ఏవై కింద హెక్టారుకు రూ. 40,000 వరకు మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతోందని తెలిపారు.
The post స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Saudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందంSaudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

    సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ

CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు