hyderabadupdates.com Gallery విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు

విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు

విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు post thumbnail image

అమరావతి : విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్ర‌శంలు కురిపించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు… ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియక పోయినా, కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పని చేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
The post విశాఖ పోలుసుల పనితీరు భేష్ : చంద్రబాబు నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌నక‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌న

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్ర‌జా పాల‌న పేరుతో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేస్తున్నారంటూ ఆవేద‌న

ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానంఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం

హైద‌రాబాద్ : ఇండియాలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మీడియా సంస్థ‌గా గుర్తింపు పొందింది ఇండియా టుడే. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయంటీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన