hyderabadupdates.com Gallery వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి

వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి

వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి post thumbnail image

జైపూర్ : ఐపీఎల్ 2026లో ప్లేస్ ఏదైనా స‌రే విజ‌యం మాత్ర‌మే త‌మ‌దేన‌ని నిరూపిస్తున్నారు ఇషాన్ కిష‌న్ నేతృత్వ‌లోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. తాజాగా జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో స‌త్తా చాటింది హైద‌రాబాద్. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మ‌రో వైపు చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య వంశీ కేవ‌లం 35 బంతుల్లో సెంచ‌రీ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. స‌న్ రైజ‌ర్స్ 5 వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి చేరుకోగా నాలుగో ప్లేస్ లోకి వెళ్లింది రాయ‌ల్స్. నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 18.3 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.
ఆదిలోనే ట్రావిస్ హెడ్ పెవిలియ‌న్ బాట ప‌ట్టినా ఎక్క‌డా తొణ‌క‌లేదు. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడాడు. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. ఇషాన్ కిష‌న్ 31 బంతుల్లో 74 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శ‌ర్మ 57 29 బాల్స్ ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. 11 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 132 ప‌రుగులు జోడించారు. నితీశ్ కుమార్ 36 ర‌న్స్ చేస్తే క్లాసెన్ 29 ప‌రుగులు చేశారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో బ్రిజేష్ 44 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చితే ఆర్చ‌ర్ 34 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
The post వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కేర‌ళ‌కే కాదు భార‌త దేశానికి శాంస‌న్ గ‌ర్వ‌కార‌ణంకేర‌ళ‌కే కాదు భార‌త దేశానికి శాంస‌న్ గ‌ర్వ‌కార‌ణం

కేర‌ళ : కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హీరోగా మారిన త‌మ కేర‌ళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు

రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ అరెస్ట్రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ అరెస్ట్

మహారాష్ట్ర : మ‌నుషుల బ‌ల‌హీన‌త‌న‌ల‌ను ఆస‌రాగా చేసుకుని బాబాలు, జ్యోతిష్కులు, సంఖ్యా శాస్త్ర‌వేత్త‌లు రెచ్చి పోతున్నారు. అందినంత మేర దండుకుంటున్నారు. ప్ర‌ధానంగా చాలా మంది ఎక్కువ శాతం మ‌హిళ‌ల‌ను లోబ‌ర్చు కోవ‌డం, లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డ‌డం, బ్లాక్ మెయిల్ చేయ‌డం, సీసీ

సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దాసామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా

హైద‌రాబాద్ : ఆప్ ఎంపీ రాఘవ్‌చద్దా అనే ఈ యువ పార్లమెంటేరియన్ ఎన్నడూ సామాన్యుల జీవితాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదు. అలాగే మధ్య తరగతి జీవితాల్ని ఉద్దరించే ప్రశ్నలూ లేవనెత్త లేదు. ఎగువ మధ్య తరగతి, ధనవంతుల గురించే ఎక్కవ