hyderabadupdates.com Gallery చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం

చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం

చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం post thumbnail image

జైపూర్ : జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన తురుపు ముక్క‌, చిచ్చ‌ర పిడుగు , 15 ఏళ్ల వ‌యసు క‌లిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. అతి త‌క్కువ బంతుల్లో సెంచ‌రీ చేశాడు. కేవ‌లం 37 బంతులు ఎదుర్కొని 103 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 12 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఇషాన్ కిష‌న్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. మైదానంలోకి వ‌చ్చీ రావ‌డంతోనే రెచ్చి పోయాడు సూర్య‌వంశీ. బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. స్టార్ బౌలర్ల‌ను ఉతికి ఆరేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు.
త‌న‌తో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన మ‌రో క్రికెట‌ర్ ధ్రువ్ జురైల్ సైతం రెచ్చి పోయాడు. త‌ను కూడా తీసి పోని విధంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. త‌ను 51 ప‌రుగులు చేశాడు. ఫెరీరా 33 ప‌రుగులు చేయ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 6 వికెట్లు కోల్పోయి 228 ర‌న్స్ చేసింది. మ‌రోసారి రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ నిరాశ ప‌రిచాడు. త‌ను కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అనంర‌తం మైదానంలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ దంచి కొట్టింది. తొలుత ట్రావిస్ హెడ్ త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ బాట ప‌ట్టినా ఆ త‌ర్వాత అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ లు తొలి వికెట్ కు 132 ర‌న్స్ చేశారు. జ‌ట్టును విజ‌య ప‌థంలోకి న‌డిపించారు.
The post చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందిTG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

    తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు

జ‌గ‌న్ రెడ్డికి అభివృద్ది అంటే ప‌డ‌దు : ఎస్. స‌వితజ‌గ‌న్ రెడ్డికి అభివృద్ది అంటే ప‌డ‌దు : ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న‌కు నిలువెల్లా విషం త‌ప్ప ఏమీ లేద‌న్నారు. అభివృద్ది అంటే ప‌డ‌ద‌న్నారు. ఎంత సేపు చిల్ల‌ర రాజ‌కీయాలు

PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీPM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ

    వందేమాతరం గేయం… దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ..